‘షార్‌’లో  ప్రమాదం

15 Oct, 2019 05:12 IST|Sakshi

రెండో వీఏబీ భవనంలో కూలిన ప్లాట్‌ఫామ్స్‌

రూ.2కోట్ల ఆస్తి నష్టం!

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌లోని రెండో వాహన అనుసంధాన భవనంలో సోమవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాకెట్‌ పరికరాలు అనుసంధానం చేసే ప్లాట్‌ ఫారాలు కూలి రూ. 2కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం. త్రుటిలో ప్రాణ నష్టం తప్పిం ది. షార్‌లోని రెండో వీఏబీ భవనంలో రాకెట్‌ అనుసంధానం చేసే ఎఫ్‌సీవీఆర్‌పీ ప్లాట్‌ ఫారాలు న్నాయి. పరికరాలు మోసుకెళ్లే గేర్‌ బాక్స్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.  దీనిని సరిచేసేప్పుడు అయిల్‌ లీకై రెండు ప్లాట్‌ఫారాలు కూలిపోయాయి. ప్రమాద సమయంలో సిబ్బంది టీ తాగేందుకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. షార్‌ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ప్రమాదంపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించారు.

>
మరిన్ని వార్తలు