చంద్రబాబు మరో మోసానికి యత్నం: రాజశేఖర్

6 Apr, 2019 16:15 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత వైఎస్సార్‌ హయాంలో ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వైస్సార్‌సీపీ నేతలు జీవిత, రాజశేఖర్‌ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య శ్రీ, 108 లాంటి పథకాలతో ఎంతో మందికి ప్రాణదాత అయ్యారని గుర్తుచేశారు. తణుకులోని లయన్స్‌ క్లబ్‌లో శనివారం ముస్లింల ఆత్మీయ సమావేశం వారు పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్‌ కంటే మంచి పథకాలను అమలు చేస్తానంటున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఒక్కఅవకాశం ఇవ్వాలని వారు కోరారు. చంద్రబాబు నాయుడికి అనుభవం ఉందని సీఎం చేసి అందరూ మోసపోయారని అన్నారు. అమరావతి పేరుతో ముప్పైవేల ఎకరాల పంట భూములను నాశనం చేశారని వారు ఆరోపించారు.

అమరావతిని సింగపూర్‌ చేస్తానని భ్రమపెట్టారని, అక్కడి కంపెనీల దగ్గర కమీషన్లు కొట్టేశారని విమర్శించారు. ప్రజల కోసం బ్రతికే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్‌ జగన్‌ మాత్రమే అని స్పష్టం చేశారు. మన భవిష్యత్తు బంగారంలా ఉండాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయ్యాలని అభ్యర్థించారు. వేలకోట్ల సంపాదన వదిలేసి పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చారని, చంద్రబాబు దగ్గర బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. పసుపు కుంకుమ డబ్బులతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అది ప్రజల డబ్బున్న విషయాన్ని మహిళలంతా గమనించాలని సూచించారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు