ప్రధాని దొంగలను కాపాడే మేస్త్రీ : నారాయణ

3 Sep, 2013 03:54 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను దొంగలను కాపాడే మేస్త్రీ అని పిలిస్తే సమంజసంగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ప్రధాని చర్యలను పరిశీలిస్తే ఈ పదమే సరిపోతుందని పేర్కొన్నారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయున ప్రధానిని తీవ్రంగా దుయ్యబట్టారు. ‘ఆర్థికవేత్తగా పేరొందిన మన్మోహన్‌సింగ్‌ను ‘దొంగ’ అని తోటి పార్లమెంటు సభ్యులు అనటంతో ప్రధాని ఆక్రోశం వ్యక్తంచేశారు. సభ్య సమాజ ం దీన్ని ఖండించాల్సిందే. మన్మోహన్‌ను దొంగ అనడాన్ని నేను ఆమోదించను. ఆ పదం ప్రధానికి ఎలా వర్తిస్తుంది? కనీస రాజకీయ-ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారు ఆ విధంగా సంబోధించరు.

అరుుతే కాపలాదారుడిని అంటున్న మన్మోహన్ ఖజానా ఖాళీ అవుతున్నా గుడ్లప్పగించి చూస్తున్నారు. దోపిడీ చేసే వాళ్లపై ఈగ వాలనీయకుండా చూసే వారిని ఏవునాలో.. ఆయునను అలానే పిలివాలి’ అని వ్యాఖ్యానించారు. ‘బ్యాంకులకు బకాయిపడ్డ సంపన్నులనుంచి మూడు లక్షల కోట్ల రూపాయలను వసూలు చేయకపోగా, నిరర్ధక ఆస్తులుగా పరిగణించి సంతృప్తి పడుతున్నారు. పార్లమెంటును నడపడానికి బెదిరింపులు, ప్రలోభాలతో ప్రయుత్నిస్తున్నారు’ అని వివుర్శించారు.
 

మరిన్ని వార్తలు