గర్భంలోనే కత్తులు  పెట్టుకొని పుట్టాలేమో?

8 Jul, 2019 12:01 IST|Sakshi

ప్రజానాట్యమండలి కవితా గోష్ఠిలో కవులు

ఒంగోలు టౌన్‌: ఆడపిల్ల బతకాలంటే తల్లి గర్భంలోనే కత్తులు పెట్టుకొని పుట్టాలి అన్నట్లుగా సమాజంలో ప్రస్తుత పరిస్థితులు ఉంటున్నాయని పలువురు కవులు వాపోయారు. ప్రజానాట్యమండలి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో ‘నన్ను బతకనివ్వరా’ అంటూ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కవితా గోష్ఠిని నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న దురాగతాలను కవులు, కవయిత్రులు తమ కవితల ద్వారా చదివి వినిపించారు. ప్రజానాట్యమండలి జిల్లా గౌరవాధ్యక్షుడు బీ  దశర««ధ్‌ అధ్యక్షతన జరిగిన కవితా గోష్ఠిలో ప్రముఖ మహిళా కవి సింహాద్రి జ్యోతిర్మయి, నన్నపనేని రవి, కే లక్ష్మి, ఉన్నం జ్యోవాసు, ఎం. వెంకటఅప్పారావు, మూర్తి, ఎన్‌. రాధికారత్న, చింతపల్లి ఉదయజానకిలక్ష్మి, పాలూరి ప్రసాద్, కుర్రా ప్రసాద్, చాపల భాస్కర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి గదవల్ల బాలకృష్ణ, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర నాయకుడు ఉబ్బా కోటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ వినోద్, నగర కార్యదర్శి కే చిన్నపరెడ్డి, డీవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు