పోలీసుల అలెర్ట్

13 Feb, 2014 00:56 IST|Sakshi
పోలీసుల అలెర్ట్

సాక్షి, విశాఖపట్నం : తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ప్రయత్నాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీతో పాటు ఎన్జీవోలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాపోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎక్కడా అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రధాన కూ డళ్లలో బుధవారం రాత్రి నుంచే నిఘా పెం చింది. గురువారం భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు కుమార్తె వివాహం కూడా జరగనున్న నేపథ్యంలో పలువురు వీవీఐపీలు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా పోలీసుశాఖ జల్లెడ పడుతోంది. బంద్ సందర్భంగా ఎక్కడా ఆందోళనలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం పంపిన అదనపు బలగాలను జిల్లా అంతటా బుధవారం రాత్రి నుంచే మోహరించింది. జాతీయ రహదారిపై ఆటంకాలు లేకుండా చేసేందుకు ఎక్కడికక్కడ బలగాలను తరలించారు. ఉదయం నుంచే ప్రత్యేక బలగాలతోపాటు సిటీ పోలీసులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దుగ్గల్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.
 

మరిన్ని వార్తలు