పోలీసుల అదుపులో ఐదుగురు కశ్మీరీలు

28 Jan, 2017 03:14 IST|Sakshi
పోలీసుల అదుపులో ఉన్న కశ్మీర్‌ వాసులు

విమానాశ్రయం (గన్నవరం): విమానాశ్రయ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరి స్తున్న ఐదుగురు కశ్మీర్‌ వాసులను పోలీసులు శుక్ర వారం అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని విమానాశ్రయాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. విమానాశ్రయం ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు యువకులు ఎస్‌కె.అహ్మద్, జావేద్‌ అక్బర్, జావేద్‌ అహ్మదార్‌ సంచరిస్తుండటాన్ని గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తమది జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు సమీపంలోని సుపియర్‌ జిల్లా అని, ఎయిర్‌పోర్టు సమీపంలోని దుర్గాపురంలో ఉన్న మదరసాకు వచ్చామని చెప్పారు.

అనుమానం వచ్చిన పోలీసులు గన్నవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వారితోపాటు వచ్చి మసీదులో ప్రార్థన చేస్తున్న షేక్‌ బషీర్‌(65), సనవుల్లాబాట్‌(70)ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బషీర్‌ కుంకుమపువ్వు వ్యాపారం చేస్తాడని, అతనితోపాటు వచ్చిన నలుగురు యువకుల పిల్లలు చిత్తూరు జిల్లా పుంగనూరులోని మదర్సాల్లో చదువు కుంటున్నారని విచారణలో తేలింది. వీరిని చూసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో దుర్గాపురంలోని మదర్సా గురువు హుస్సేన్‌ను కలిసేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. వారికి మద్దతుగా ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పారుక్‌షుబ్లీ, హుస్సేన్‌లు స్టేషన్‌కు వచ్చారు.

మరిన్ని వార్తలు