చీటీల పేరుతో మోసం చేసిన జంట అరెస్ట్‌

18 Sep, 2019 19:44 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని నర్సాపురంలో చిట్‌ఫండ్‌ పేరుతో సుమారు రూ. 6 కోట్లు టోకరా వేసి పరారైన కంచన రమేష్‌, దివ్య దంపతులను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహరంలో మొదటి నుంచి వారికి సహకారం అందిస్తున్న సమీప బంధవు సూరత్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 20 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 

చిట్‌ ఫండ్‌తో పాటు అధిక వడ్డీ ముసుగులో జిల్లాకి చెందిన పలువురిని మోసానికి గురి చేశారు. అంతేకాకుండా తమ స్నేహితులు, సన్నిహితుల నుంచి బంగారం తీసుకుని చివరికి వారికి కూడా కుచ్చు టోపీ పెట్టారు. అయితే తిరిగి నగలు, నగదు అడిగే సరికి ఆ జంట మొఖం చాటేశారు. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  వీరి చేతిలో మోసపోయిన వారి సంఖ్య 60 మంది పైనే ఉంటుందని డీఎస్పీ నాగేశ్వర రావు మీడియాకు వెల్లడించారు.

మరిన్ని వార్తలు