అమాయకుడిపై ఖాకీ ప్రతాపం 

28 Jul, 2019 07:43 IST|Sakshi
బాధితుడు నాగముని చెంపపై కనిపిస్తున్న పోలీసు బూటు ముద్ర  

తొంగి చూశాడని బూటు కాలితో తన్నిన పోలీసు

అవమాన భారంతో బాధితుడు మనస్తాపం 

న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు వేడుకోలు 

సాక్షి, పుట్లూరు: అమాయకుడిపై పోలీసు అధికారి ప్రతాపం చూపిన ఘటన వెలుగు చూసింది. పోలీసుస్టేషన్‌లో అదుపులో ఉన్న యువకులను కిటికీలోంచి తొంగి చూశాడన్న నెపంతో లోనికి పిలిచి ముఖంపై బూటు కాలితో మూడుసార్లు తన్నడంతో బాధితుడు అవమానభారంతో కన్నీటిపర్యంతమయ్యాడు. అకారణంగా తనపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నాడు. వివరాల్లోకెళ్తే... పుట్లూరు మండలం అరకటివేముల ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ తనపై శుక్రవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారని శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాలనీకి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకొచ్చారు.  

తొంగి చూడటమేమైనా నేరమా..? 
దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను విచారణ నిమిత్తం తీసుకొచ్చారని తెలిసి అదే కాలనీకి చెందిన నాగముని అనే దళితుడు స్టేషన్‌ వద్దకు వచ్చాడు. యువకులను ఉంచిన గదిలోకి నేరుగా వెళ్లకుండా కిటికీలో నుంచి చూస్తున్న నాగమునిని పోలీసులు గమనించి.. లోనికి పిలిపించారు. అనుమతి లేకుండా కిటికీలోంచి ఎందుకు చూస్తున్నావని ప్రశ్నించగా.. తమ గ్రామస్తులను చూడటానికి వచ్చానని చెప్పాడు. అంతే.. ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడ్డారు. మద్యం తాగి లోపలికి వస్తావా అంటూ బూటుకాలితో నాగముని ముఖంపై తన్నారు. అలా మూడుసార్లు తన్నారు. తనేమీ నిందితుడు కాకపోయినా.. దురుసుగా మాట్లాడకపోయినా తన్నడాన్ని నాగముని అవమానంగా భావించాడు. తన ముఖంపై పడిన బూటు ముద్రను విలేకరులకు చూపుతూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తనపై అకారణంగా దాడిచేసిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరాడు. 

డీఎస్పీ విచారణ 
అమాయకుడిపై పోలీసు బూటుకాలితో తన్నిన ఘటన గురించి మీడియాలో రావడంతో తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు శనివారం సాయంత్రం అరకటివేముల ఎస్సీ కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పుట్లూరు పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసు సిబ్బందితో సమావేశమై ఘటనకు సంబంధించి ఆరా తీశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

80% ఉద్యోగాలు స్థానికులకే.. 

నా కుమారుడు చచ్చినా పర్వాలేదు

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి

‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’

దావోస్‌లో ఏపీ లాంజ్‌ ఖర్చు రూ.17 కోట్లు

ప్రభుత్వ మద్యం షాపులకు ప్రతిపాదనలు సిద్ధం!

యజ్ఞంలా ‘నివాస స్థలాల’ భూసేకరణ 

‘జగతి’ ఎఫ్‌డీఆర్‌ను వెంటనే విడుదల చేయండి 

ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఇక పక్కాగా..

విశాఖ ఏజెన్సీని ముంచెత్తిన వర్షాలు

గాంధీ జయంతి నుంచి.. గ్రామ సురాజ్యం

పెట్టబడుల ఆకర్షణకై రాష్ట్ర ప్రభుత్వం భారీ సదస్సు

ఈనాటి ముఖ్యాంశాలు

‘అది సాహసోపేతమైన నిర్ణయం’

బాధ్యతలు చేపట్టిన ఆర్టీజీఎస్‌ నూతన సీఈవో

పొనుగుపాడు ఘటనపై స్పందించిన హోంమంత్రి

‘చంద్రబాబు డైరెక‌్షన్‌లో మందకృష్ణ మాదిగ’

‘వర్గీకరణకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదు’

వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం

గత ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమా?

వ్యయమా.. స్వాహామయమా..?

వాహన విక్రయాల్లో అక్రమాలకు చెక్‌

అసెంబ్లీలో అనంత ఎమ్మెల్యేల వాణి

సెల్‌ఫోన్‌తో కనిపిస్తే ఫిర్యాదు చేయొచ్చు  

వివాదాస్పద స్థలం పరిశీలన

రూల్స్‌ బ్రేక్‌ .. పెనాల్టీ కిక్‌

‘సహృదయ’ ఆవేదన!

అబ్దుల్‌ కలాంకు సీఎం జగన్‌ నివాళి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!