మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా

8 Dec, 2018 07:00 IST|Sakshi
దత్తిరాజేరు: శిథిలమైన పోలీస్‌ క్వార్టర్స్‌ను పరిశీలిస్తున్న డీఐజీ శ్రీకాంత్, ఎస్పీ పాలరాజు

విశాఖ రేంజ్‌ డీఐజీ సీహెచ్‌ శ్రీకాంత్‌

విజయనగరం, రామభద్రపురం: విశాఖపట్నం రేంజ్‌ పరిధిలో మావోయిస్టుల కదలికలపై  ప్రత్యేక నిఘా సారిస్తున్నట్లు డీఐజీ సీహెచ్‌ శ్రీకాంత్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, జిల్లాలో మాఓయిస్టుల కదలికలు లేవన్నారు. అయితే ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో కదలికలు ఉన్నట్లు చెప్పారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య తర్వాత ఆయన కుమారుడుకి ఆక్టోపస్‌ భద్రత కల్పించినట్లు తెలిపారు. పోలీస్‌శాఖలో ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు.

పోస్టులు భర్తీ కాగానే పోలీస్‌స్టేషన్లను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.  మహిళలపై దాడులు జరగకుండా ముఖ్య కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈవ్‌టీజింగ్‌లు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. పెండిగ్‌ కేసులు అధికంగా ఉన్న చోట వెంటవెంటనే సాక్ష్యాధారాలు సేకరించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.  జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 8,436 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయని.. వారికి జైలు శిక్షలతో పాటు అపరాధరుసుం విధించినట్లు తెలిపారు. ఆయనతో పాటు ఎస్పీ పాలరాజు, ఏఎస్పీ గౌతమీశాలి, సీఐ ఇలియాస్‌ అహ్మద్, ఎస్సై బి. లక్ష్మణరావు ఉన్నారు.  

ప్రమాదాల నివారణకు చర్యలు
దత్తిరాజేరు : జాతీయ రహదారి పరిధిలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని డీఐజీ శ్రీకాంత్‌ సిబ్బందికి సూచించారు. పెదమానాపురం పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించిన ఆయన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం శిథిలమైన క్వార్టర్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీ పాలరాజు, ఏఎస్పీ గౌతమీశాలి, సీఐ విద్యాసాగర్, ఎస్సై కాంతికుమార్, తదితరులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు