జేసీపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

20 Dec, 2019 03:42 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారుల సంఘం డిమాండ్‌

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/చిత్తూరు అర్బన్‌/కడప అర్బన్‌: ఏపీ పోలీసులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్‌ చేసింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బూట్లు నాకే సంస్కృతి తమది కాదని, రాజకీయాల్లో ఆ స్థాయికి రావడానికి జేసీ ఎవరి బూట్లు నాకారో చెప్పాలన్నారు. చంద్రబాబు సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు నవ్వడం సిగ్గుచేటని.. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్‌ ఖాన్, సంఘం నాయకులు స్వర్ణలత, కె.నాగిని, పి.శేషయ్య పాల్గొన్నారు.

జేసీని కుక్కల వ్యాన్‌లో ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాలి  
జేసీ వ్యాఖ్యలు ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని చిత్తూరు జిల్లా పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్‌ అన్నారు. పిచి్చకుక్కలా మాట్లాడుతున్న దివాకర్‌రెడ్డికు గొలుసులు వేసి కుక్కల వ్యానులో ఎక్కించి ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాలన్నారు. కాగా, మాజీ ఎంపీ జేసీపై కేసులు నమోదు చేయిస్తామని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పుశంకర్, వాటం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. జేసీని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరి్పంచాలని పోలీసు అ«ధికారుల సంఘం వైఎస్సార్‌ జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌ జేసీ కుటుంబసభ్యులకు సూచించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షాదీ.. 'కరోనా'

ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం

కరోనా కట్టడికి ప్రభుత్వాలకు సహకరించండి

ఎల్లో మీడియా తప్పుడు వార్తలు

నేటి నుంచి మార్కెట్‌ యార్డుల పునఃప్రారంభం 

సినిమా

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం

జూన్‌లో మోసగాళ్ళు

ఇంట్లో ఉండండి

కుశలమా? నీకు కుశలమేనా?

లెటజ్‌ ఫైట్‌ కరోనా

చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా