ఏజెన్సీలో ముమ్మర తనిఖీలు

3 Dec, 2014 01:51 IST|Sakshi

కురుపాం: ఏజెన్సీలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మాజిల్లాలో సోమవారం సీఆర్‌పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపిన సంఘటనలో 13 మంది జవాన్లు మృతి చెందిన సంఘటన విదితమే. ఈ నేపథ్యంలో ఒడిశా సరిహద్దు మండలాలైన కురుపాం, కొమరాడ పోలీసులు అప్రమత్తమై మంగళవారం విస్త్రత తనిఖీలు నిర్వహించారు.  ఏజెన్సీ ముఖ ద్వారమైన కురుపాం మండల కేంద్రంలో ఎస్సై ఎన్.అశోక చక్రవర్తి పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేసి అపరిచిత వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.
 
 
 గుమ్మలక్ష్మీపురంలో..
 మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో మంగళవారం ఎల్విన్‌పేట పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్ ఆదేశాల మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్ ఐ.గోపి ఆధ్వర్యంలో పలు ప్రధాన జంక్షన్ల వద్ద ఎల్విన్‌పేట సీఆర్‌పీఎఫ్,సివిల్ పోలీసులు వాహన తనిఖీలు చేశారు. పార్వతీపురం,కురుపాం,ఒడిశా తదితర ప్రాంతాలనుంచి రాకపోకలు సాగించే వాహనాలను నిలుపుదల చేసి క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపించినా వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు