‘పోలీస్ జాగిలం కూడా సైనికుడిలా పని చేస్తుంది’

14 May, 2019 10:30 IST|Sakshi

సాక్షి, అమరావతి : మంగళగిరి ఆరవ బెటాలియన్‌లో జాగిలాల శిక్షణ ముగింపు సభకు ముఖ్య అతిథిగా డీజీపీ ఠాకూర్ హాజరయ్యారు. 18వ బ్యాచ్ కింద 30జాగిలాలకు వివిధ అంశాల్లో పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు శిక్షణ ఇచ్చారు. 

ఈ సందర్భంగా డీజీపీ ఠాకూర్ మాట్లాడుతూ..'శిక్షణ పొందిన జాగిలాలు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. జాగిలాలకు మంచి శిక్షణ అందించిన వారిని అభినందిస్తున్నా. పోలీస్ విధుల్లో సిబ్బందే కాదు.. జాగిలాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడంలో జాగిలాల పని తీరు అభినందనీయం. ఆధారాలు లేని ఎన్నో కేసులను కూడా జాగిలాల కారణంగా చేధించారు. బాంబులను పసిగట్టి, నిర్వీర్యం చేసేందుకు జాగిలాలు ఎంతో సహకరిస్తాయి. సమాజంలో ప్రజల భద్రతలో పోలీస్  జాగిలం కూడా సైనికుడిలా పని చేస్తుంది. 30జాగిలాలకు శిక్షణ పూర్తి కావడంతో వివిధ విభాగాలకు అప్పగిస్తున్నాం' అని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు