'సభ్య సమాజం తలదించుకునేలా హరీష్ వ్యవహరించారు'

9 Jan, 2014 18:50 IST|Sakshi

అనంతపురం:విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ ను టీఆర్ఎస్ నేత హరీష్ రావు దూషించడాన్ని పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే హోదాలో ఉన్న హరీష్ రావు సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని పోలీస్ అధికారుల సంఘం కార్యదర్శి గోరంట్ల మాధవ్ విమర్శించారు. కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, దూషణలకు దిగిన హరీష్ రావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేస్తామని హెచ్చరించారు.

 

ఐటీఐఆర్‌ ప్రాజెక్టులో భాగంగా  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గేమింగ్ సిటీ శంకుస్థాపనను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో పాటు హరీష్‌ రావు  అక్కడకు వచ్చారు. అయితే వారిని పోలీసులు  అరెస్టుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఓ పోలీసుపై హరీష్‌ రావు ......నువ్వు ఆంధ్రోడివా... తెలంగాణ వాడివా..?  అంటూ ప్రశ్నించారు. ఇంతలో తనను మీడియా గమనిస్తున్నట్లు తెలుసుకున్న హరీష్ రావు నోటికి తాళం వేశారు.   పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై పోలీసు వర్గాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి.

మరిన్ని వార్తలు