కర్నూల్‌లో పోలీసుల దాడులు!

9 Jun, 2020 17:29 IST|Sakshi

సాక్షి, కర్నూలు: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లాలో మంగళవారం స్థానిక  పోలీసులు చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని వారు, రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘించిన వారు, పేకాటరాయుళ్లు ఇలా జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు.  వారిపై ఐపీసీ సెక్షన్‌ 188, 269, 270, 271కింద కేసులు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిచిన దుకాణదారులు, ఇతర వ్యక్తులు మొత్తం 39 మందిపై 24 కేసులను పోలీసులు నమోదు చేశారు. (సీఎం జగన్తో సినీ పెద్దల భేటీ)

 వీటితో పాటు రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మొత్తం 854 ఎంవీ కేసులు నమోదు చేశారు. మొత్తం రూ. 3,18,315 విలువ గల ఫైన్లు వేస్తూ చలానాలు జారీ చేశారు.  మరోవైపు 11 వాహనాలను కూడా సీజ్‌ చేశారు. ఇక జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రూ. 1,32,800 ల నగదు,  2112  లిక్కర్ బాటిల్స్, 35 కేజీల బెల్లం, 190 లీటర్ల నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (థాంక్యూ వైఎస్ జగన్: పెటా)

మరిన్ని వార్తలు