245 మంది చిన్నారుల గుర్తింపు!

4 Jan, 2020 14:14 IST|Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా: బడి వయసు పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఎస్పీ రవీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని పోలీసు అధికారులు శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు మొత్తం 245 మంది చిన్నారులను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్‌లు‌, దుకాణాలల్లో మొత్తం 245 మంది చిన్నారులను గుర్తించామని, వారిలో 183 మంది బాలురు, 62 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని పాపను గుర్తించి.. ఆ చిన్నారిని తిరిగి బడికి వెళ్లేలా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మైలవరం సర్కిల్‌ పరిధిలో బడి బయట ఉన్న 29 మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు స్టేషన్‌లో కౌన్సిలింగ్‌ ఇప్పించి పంపించినట్లు ఆయన తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా