ముద్రగడను మళ్లీ అడ్డుకున్న పోలీసులు

14 Aug, 2017 01:10 IST|Sakshi
ముద్రగడను మళ్లీ అడ్డుకున్న పోలీసులు
కిర్లంపూడి (జగ్గంపేట): మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన నిరవధిక పాదయాత్రను ఆదివారం కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఓఎస్‌డీ రవిశంకర్‌రెడ్డి, రంపచోడవరం ఏఎస్పీ నయీమ్‌ఆద్మీ, పెద్దాపురం డీఎస్పీ రామారావు ముద్రగడ ఇంటి గేటు వద్దకు రాగానే ఎదురుగా వచ్చారు. దీంతో ఈ రోజు కూడా మా జాతికి స్వేచ్ఛ లేదా అంటూ ముద్రగడ వారిపై మండిపడ్డారు. గతంలో ఒక ఎస్సైని ఒక నాయకుడు బంధిస్తే పోలీసులు అంతా ఒక్కటై ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.

హామీ తప్పిన ప్రభుత్వంపై మా జాతి అంతా ఒక్కటవ్వకూడదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు లేదా అని మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులూ.. గేటు వద్ద కాపలా కాస్తూ మీ స్థాయి దిగజార్చుకోవద్దన్నారు. పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదు, ఇవాళ కాకపోతే రేపు చేస్తానని పోలీసులను ఉద్దేశించి ముద్రగడ అన్నారు. పాదయాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా గేటు వద్ద జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్రకు వెంటనే అనుమతినివ్వాలని 
డిమాండ్‌ చేశారు. 
మరిన్ని వార్తలు