పోలీస్ పటేళ్లు!

4 Nov, 2013 07:13 IST|Sakshi

 కామారెడ్డి, న్యూస్‌లైన్:

 గ్రామ పోలీసు అధికారులు (వీపీఓ) కొన్ని ఊళ్లల్లో ‘పోలీసు పటేళ్ల’ను మరిపిస్తున్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ కొనసాగి న కాలంలో గ్రామాల్లో ఏది జరగాలన్నా, ఏం జరిగినా పోలీస్, మాలీస్ పటేళ్ల పెత్తనమే నడిచేది. ఇప్పుడు గ్రామానికో పోలీసు వ్య వస్థ ప్రవేశపెట్టిన తరువాత కొం దరు వీపీఓలు పోలీసు పటేళ్లలాగే పెత్తనం చెలాయిస్తున్నారన్న వి మర్శలు వస్తున్నాయి. తాము చె ప్పిందే వేదం అన్న రీతిలో వ్యవహరిస్తూ  పల్లెల్లో పెత్తందారీ పోకడలను అవలంభిస్తున్నారు. గ్రామాల్లో జరిగే గొడవ లు, తగాదాల విషయంలో తమకు డబ్బులు ఎవరు ఇస్తారో వాళ్లవైపే మాట్లాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. తద్వారా ప్రజలతో సం బంధాలు మెరుగు పడటం ఏమోగానీ.. పోలీ సులంటేనే ప్రజలు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఊరికో పోలీసు వ్యవస్థను పరిచయం చేసింది. దీని ద్వారా ఆయా పోలీ సు స్టేషన్ల పరిధిలో గ్రామానికి ఒక పోలీసును నియమించింది.

 

  గ్రామాల్లో సంబంధిత గ్రామ పోలీసు అధికారి సెల్‌నంబరుతో పాటు, సం బంధిత పోలీసు స్టేషన్, ఎస్సైల నంబర్లను ప్రధాన కూడళ్ల వద్ద రాయించారు. గ్రామాల్లో ఏ సంఘటన జరిగినా ప్రజల నుంచి సమాచా రం తెలుసుకోవడం, వెంటనే అక్కడికి పోలీ సులు చేరుకునేందుకు దోహదపడతాయనేది దీని ఉద్దేశ ం. గ్రామాల పోలీసు అధికారులు ఆయా గ్రామాల ప్రజలతో ఎప్పటికప్పుడు సన్నిహిత సంబంధాలు నెరపడంతో పాటు గ్రామాన్ని విజిట్ చేస్తూ పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సి ఉం టుంది. ముఖ్యంగా గ్రామాల్లో జరిగే ఘర్షణ లు, కుమ్ములాటలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పోలీసు అధికారులకు తెలపాల్సి ఉం టుంది. అయితే కొందరు వీపీఓలు మాత్రం ఈ విషయాన్ని పక్కనపెట్టేసి వసూళ్లపైనే దృష్టి సారించారన్న విమర్శలున్నాయి.

 

 ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నచిన్న గొడవల్లో సైతం కులసంఘాలు పెద్ద జరిమానాలు విధించే సంస్కృతి ఇటీవల పెరిగిపోయింది. జరిమానాలు చెల్లించని వారికి కుల బహిష్కరణలు విధించేందుకు కూడా వెనుకాడడం లేదు. దీంతో అమాయకులు ఇబ్బందు లు పడాల్సిన పరిస్థితులను చాలా గ్రామాల్లో ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో దొంగచాటుగా నడుస్తున్న మద్యం విక్రయాలు, పేకాట వంటి వాటిలో వీపీఓలు అందినకాడికి దండుకుంటూ అధికారుల దృష్టికి వెళ్లకుండా చూసుకుంటున్నట్లు విమర్శలున్నాయి. మరికొ న్ని గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నా వీపీఓలు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

 

 వీపీఓలపై పర్యవేక్షణ కరువు...

 ప్రజలకు దగ్గరవడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిం చి బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీపీఓ వ్యవస్థలో పర్యవేక్షణ కరువైంది. వీపీఓలు గ్రామాలకు వెళ్తున్నారా.. లేదా? వెళ్లి ఎవరితో సమయం కేటాయిస్తున్నా రు? అన్న విషయాలపై రివ్యూ జరిగిన సందర్భాలు తక్కువనే తెలుస్తోంది. కొందరి మూలంగా వీపీఓ వ్యవస్థ వికటి ంచి పోలీసుల కు చేరాల్సిన సమాచారం చేరకుండా పోతుం దన్న విమర్శలున్నాయి. గ్రామాల్లో వీపీఓల పెత్తనం పెరిగిందన్న ఆరోపణలున్నాయి.

 

 కొందరు గ్రామాల్లో విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారని, ఊరు మొత్తానికి తానే బాస్‌ననే ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా పోలీసు వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల ద్వారా ఏర్పాటైన గ్రామ పోలీసు అధికారి వ్యవస్థ పర్యవేక్షణ లేకపోవడం మూలంగానే దెబ్బతింటోందని, ఎప్పటికప్పుడూ అధికారులు పర్యవేక్షిస్తే పరిస్థితులు మార వచ్చంటున్నారు. లేని పక్షంలో ప్రజలు పోలీసులకు దూరం కావడంతో పాటు, సహ కారం కొరవడుతుందని అంటున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా