ఏవోబీలో కొనసాగుతున్న ఉద్రిక్తత..!

8 Oct, 2018 09:22 IST|Sakshi

మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు

గ్రామస్థులను విడుదల చేయాలని గిరిజనుల ఆందోళన

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆదివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న వారి కోసం దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. విచారణ నిమిత్తం అంత్రిగూడకు చెందిన గిరిజనులు గతవారం అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిని వెంటనే విడుదల చేయాలని స్థానిక గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. గ్రామస్థుల తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అంతే కాకుండా గిరిజనులకు మావోయిస్టులు సంబంధాలు ఉన్నయన్న కోణంలో వారిని ఆరా తీస్తున్నారు.

కిడారి, సోమ హత్య జరిగి రోజులు గడుస్తున్న విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం కోరాపూట్‌ డివిజన్‌లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయని ఒడిశా ధ్రువీకరించింది. కానీ కాల్పుల్లో ఎవ్వరూ మృతిచెందలేదని... తప్పించుకున్న మావోయిస్టులున ఎలానైనా పట్టుకోవాలని దళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయని పోలీసు అధికారులె వెల్లడించారు. దీంతో ఏక్షణంలో ఏం జరుగుతుందనని ఏవోబీలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. 

మరిన్ని వార్తలు