కుట్రదారులెవరు.. సూత్రధారులెక్కడ?

29 Oct, 2018 01:45 IST|Sakshi

రిమాండ్‌ రిపోర్ట్‌లో కుట్రకోణం లేని వైనం

దుండగుడు శ్రీనివాసరావు  పైనే కేసు నెట్టేసే యత్నం

ఎందుకు హత్య చేయాలనుకున్నాడో,

ఎవరు చేయించారో తెలుసుకునే ప్రయత్నం చేయని పోలీసులు

విస్మయం వ్యక్తం చేస్తున్న న్యాయనిపుణులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేయాలనే పన్నాగంతోనే దుండగుడు శ్రీనివాసరావు కత్తితో దాడికి తెగబడ్డాడని కోర్టుకిచ్చిన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు ఆ హత్యా పథకం వెనుక కుట్రదారులెవరు, అసలు సూత్రధారులెవరు అనే కీలక విషయాలను కనీసంగా కూడా ప్రస్తావించ లేదు. పదోతరగతి వరకు మాత్రమే చదువుకున్న యువకుడు పక్కా వ్యూహం ప్రకారం రాష్ట్ర శాంతి భద్రతల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కాకుండా కేంద్రబలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానిఎకి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు..? అతనికి ఆ విధంగా ప్రేరేపించి ఏం జరిగినా మేం చూసుకుంటాం... అని అండగా నిలిచిందెవరు.. పక్కా పథకం ప్రకారం పదినెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి అండగా నిలిచింది ఎవరు అనే కీలక విషయాలు సూత్రప్రాయంగా కూడా ఆ రిమాండ్‌ రిపోర్ట్‌లో లేవు.

శ్రీనివాసరావు ఏడాదికాలంలోపే తొమ్మిది ఫోన్లు మార్చాడని, తొమ్మిది సిమ్‌కార్డులతో పదివేలకు పైగా ఫోన్‌కాల్స్‌ మాట్లాడాడని, మూడు జాతీయ బ్యాంకుల్లో అతనికి అకౌంట్లు ఉన్నాయని స్వయంగా విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్హా నిర్ధారిస్తున్నారు. ఇటీవలికాలంలో ఆస్తులు కూడబెట్టుకునే పనితో పాటు విచ్చలవిడిగా జల్సాలు చేస్తున్నాడని అతని సొంతూరు గ్రామస్తులతో పాటు విశాఖలో పనిచేసే రెస్టారెంట్‌ సిబ్బంది చెబుతున్నారు. ఇన్ని నిధులు ఎక్కడనుంచి వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేయలేదు. ఇక నిందితుడు విచారణకు సహకరించడం లేదని పోలీసు ఉన్నతాధికారులే బాహాటంగా అంగీకరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటేనే శ్రీనివాసరావు వెనుక బడాబాబుల పాత్ర ఉందనేది ఎవరికైనా అర్ధమవుతుంది.

120బి సెక్షన్‌ ఎందుకు నమోదు చేయలేదో?
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై  కేంద్రబలగాలు పహారా కాసే ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగితే ఒక్క హత్యాయత్నం (ఐపీసీ 307) కేసు మాత్రమే  నమోదు చేశారు. కుట్రదారులు, అసలు సూత్రధారులను బట్టబయలు చేసేందుకు ఐపీసీ 120 బి సెక్షన్‌ కింది కేసు నమోదు చేసి విచారించాల్సిన పోలీసులు దాని జోలికి పోలేదు. బడాబాబులు దాగున్న కుట్ర కేసును కేవలం డబ్బు కోసం పాత్రధారి అయిన శ్రీనివాసరావుతోనే  కేసు ముగించే పనిలో పోలీసు ఉన్నట్లు తెలుస్తోందని, రిమాండ్‌ రిపోర్ట్‌లో కుట్రకోణాన్ని ప్రస్తావించక పోవడం దాన్నే సూచిస్తోందని సీనియర్‌ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు.

నేరపూరిత కుట్ర  రుజువైతే మరణ శిక్షే...
 శ్రీనివాసరావు విమానాశ్రయంలోకి కత్తిని శ్రీనివాసరావు ఎలా తేగలిగారు.. ఇందుకు ఎవరు సహకరించారు.. కత్తిని ఎవరు సమకూర్చారు.. తదితర అంశాలన్నీ కూడా కుట్ర కోణంలో దర్యాప్తు సాగినప్పుడే బహిర్గతం అవుతాయి. ‘నేరపూరిత కుట్ర రుజువైతే మరణశిక్ష, యావజ్జీవ కారాగారశిక్ష విధింవచ్చు. ఇంతటి తీవ్రమైన నేరం విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ బాసులు చెప్పిన కోణంలో దర్యాప్తును ముగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందని న్యాయనిపుణులు వాఖ్యానిస్తున్నారు.

మహేష్‌ చంద్ర లడ్హా నిర్ధారిస్తున్నారు. ఇటీవలికాలంలో ఆస్తులు కూడబెట్టుకునే పనితో పాటు విచ్చలవిడిగా జల్సాలు చేస్తున్నాడని అతని సొంతూరు గ్రామస్తులతో పాటు విశాఖలో పనిచేసే రెస్టారెంట్‌ సిబ్బంది చెబుతున్నారు. ఇన్ని నిధులు ఎక్కడనుంచి వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేయలేదు. ఇక నిందితుడు విచారణకు సహకరించడం లేదని పోలీసు ఉన్నతాధికారులే బాహాటంగా అంగీకరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటేనే శ్రీనివాసరావు వెనుక బడాబాబుల పాత్ర ఉందనేది ఎవరికైనా అర్ధమవుతుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు