పోలీసు పహరా మధ్య పాఠాలు

5 Sep, 2018 14:07 IST|Sakshi
స్కూలుకు తాళం వేయడంతో బయటే నిలబడిన హెచ్‌ఎం భారతిలక్ష్మి

వలేటివారిపాలెం మండలం నేకునాంపురం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల వద్దమంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 5వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకుపాల్పడిన ఉపాధ్యాయుడికి మద్దతుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు గ్రామస్తులు మంగళవారం రంగంలోకి దిగారు. దళితవిద్యార్థులను పాఠశాల నుంచి బటయకుగెంటేసి స్కూల్‌కు తాళాలు వేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు బడి తాళాలు తెరిపించారు. దగ్గరుండి తరగతులు నిర్వహింపజేశారు.

వలేటివారిపాలెం ,ప్రకాశం, (కందుకూరు అర్బన్‌): నేకునాంపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఎస్సీ సామాజక వర్గానికి చెందిన విద్యార్థులు 11 మంది, ఎస్టీలు 15 మంది, బీసీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. వీరికి భారతిలక్ష్మి అనే హెచ్‌ఎం, ఉన్నం వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు విద్యా బోధన చేస్తున్నారు. అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైగింక వేధింపులకు పాల్పడిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థిని బంధువులతో పాటు గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకొని లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏంఈఓ నేకునాంపురం పాఠశాలకు చేరుకొని సంఘటనకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఈఓ సూచన మేరకు ప్రధానోపాధ్యాయురాలు భారతిలక్ష్మి ఇక్కడ జరిగిన పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు ప్పాడిన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేశారు. బాధిత విద్యార్థినికి అండగా ఉండాల్సిన గ్రామస్తులు.. ఉపాధ్యాయుడిని పైనేసుకొచ్చారు. మంగళవారం పాఠశాలకు వెళ్లిన ఎస్సీ విద్యార్థులను తమ పాఠశాలకు రావద్దంటూ బయటకు గెంటేశారు. హెచ్‌ఎంను బయట నిలబెట్టి దూషించి పాఠశాలకు తాళాలు వేశారు.

పోలీసు పహరా మధ్య పాఠాలు..
నేకునాంపురం ప్రభుత్వ పాఠశాలకు గ్రామస్తులు కొందరు తాళాలు వేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పాఠశాలను దగ్గరుండి తెరిపించారు. ప్రభుత్వ పాఠశాలను మూసివేసే హక్కు ఎవరికీ లేదని, ఎవరైనా పాఠశాల వైపు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పోలీసుల పహరా మధ్య పాఠశాలను కొనసాగించారు.

ఎస్సీ కాలనీలో పాఠశాల నిర్వహించాలి..
నేకునాంపురం ఎస్సీ కాలనీలో పాఠశాల నిర్వహించాలని ప్రజలు ఎంఈఓ రాంబాబుకు వినతిప్రతం అందజేశారు. మొత్తం పాఠశాలలో 27 మంది విద్యార్థులు చదువుతుంటే 11 మంది ఎస్సీ, 15 మంది ఎస్టీ, ఒక్క బీసీ విద్యార్థి చొప్పున ఉన్నారని తెలిపారు. ఇక్కడ తమ పిల్లలకు రక్షణ లేదని, వెంటనే ప్రభుత్వం తమ కాలనీలో పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంత్రి గంటా తీవ్ర అసంతృప్తి

వైఎస్‌ జగన్‌తో భేటీకానున్న కేటీఆర్‌ బృందం

రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉంది: తలసాని

కొనసాగుతున్న శ్రీనివాస్‌ విచారణ

‘ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అర్జున్‌ రెడ్డి’ నటితో విశాల్‌ పెళ్లి!

విక్రమ్‌ న్యూ లుక్‌.. వైరల్‌ అవుతున్న టీజర్‌

ప్రియా ప్రకాశ్‌కు షాకిచ్చిన బోనీ కపూర్‌

అవకాశం వస్తే నేనోద్దంటానా?

వైరలవుతోన్న ఆశాభోస్లే ట్వీట్‌

ఇంట్లో ఇల్లాలు... గ్రౌండ్‌లో ప్రియురాలు