వ్యభిచార కేంద్రాలపై దాడులు

1 Nov, 2017 15:53 IST|Sakshi

గుట్టుచప్పుడు కాకుండా నివాసాల మధ్య  నిర్వహణ

విటులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నెల్లూరు(క్రైమ్‌): జనవాసాల నడుమ గుట్టుచప్పుడు కాకండా నిర్వహిస్తోన్న ఓ వ్యభిచార కేంద్రంపై ఒకటో నగర, సీసీఎస్‌ పోలీసులు దాడిచేసి, ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్‌ చేశారు. ఒకటోనగర పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.పాపారావు వివరాలు వెల్లడించారు. నగరంలోని యడ్లవారివీధి(శివప్రియ హాటల్‌ వెనుక)కి చెందిన కె.శాంతిలత, మైపాడుగేటు శ్రీనివాసనగర్‌కు చెందిన బి.జయలక్ష్మి అలియాస్‌ లక్ష్మి కొంతకాలంగా యడ్లవారివీధిలోని ఓ ఇంట్లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి సెక్స్‌ వర్కర్లను తీసుకొచ్చి విటులకు ఎరవేసి డబ్బులు సంపాదించసాగారు. ఈ వ్యవహారంపై మంగళవారం పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో ఇన్‌స్పెక్టర్‌ బి.పాపారావు,  సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ బాజీజాన్‌సైదా. ఒకటోనగర ఎస్‌ఐ కరిముల్లా తమ సిబ్బందితో వ్యభిచార కేంద్రంపై దాడిచేశారు. నిర్వాహకులతో పాటు ఒంగోలు జిల్లా మిరియపాళేనికి చెందిన ఎం.పెద్ద రంతూబాబు అలియాస్‌ బాబు (విటుడు), సెక్స్‌వర్కర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద నుంచి రూ.2,200నగదు, ఆరు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. నిర్వాహకులతోపాటు విటుడిపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇమ్మోరల్‌ ట్రాఫిక్‌ కింద కేసు నమోదు చేశారు. సెక్స్‌వర్కర్‌ను సూళ్లూరుపేటలోని హోమ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో ఒకటోనగర ఎస్‌ఐ షేక్‌ కరిముల్లా ఉన్నారు.

రూరల్‌ పరిధిలో..
నెల్లూరు(వేదాయపాళెం): రూరల్‌ పరిధిలో ఇరుగాళమ్మ సంఘం సమీపంలోని వాకర్స్‌ రోడ్డులో ఉన్న ఓ వ్యభిచార గృహంపై దాడిచేసి, నిర్వాహకులను, విటులను అరెస్ట్‌ చేసినట్లు రూరల్‌ సీఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. రూరల్‌ పోలీసుస్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. దగ్గోలు మునిరెడ్డికి చెందిన గృహంలో రేబాల కవిత, బత్తల సుశీలమ్మ గతకొద్ది రోజులుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని తెలిపారు. విటులు బత్తల రాజా, వేలూరు శ్రీనివాసులు,  రామిశెట్టి కుమారి, సి.పద్మ, కె.లావణ్యను అరెస్ట్‌చేసినట్లు పేర్కొన్నారు. మహిళలను ఆదరణ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు.  కేసునమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు