మీ రక్షణ.. మా బాధ్యత

5 Apr, 2020 04:06 IST|Sakshi
పోలీసులు రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. కరోనా వేషధారణలో పోలీస్‌. ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సిబ్బంది

కరోనాపై యుద్ధంలో పోలీసుల షార్ట్‌ ఫిల్మ్‌ 

డీజీపీ సవాంగ్‌ సందేశంతో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ కట్టడికి తమ వంతు ప్రయత్నంగా అలుపెరుగని యుద్ధం చేస్తున్న ఏపీ పోలీస్‌ శాఖ ‘మీ రక్షణ.. మా బాధ్యత’అంటూ సందేశాత్మక షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించింది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సందేశంతో కూడిన రెండు నిమిషాల నిడివిగల వీడియోను శనివారం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. 

► కుటుంబాలకు దూరంగా రోడ్డుపైనే విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల చిత్రాలు, అన్న పానీయాలు రోడ్డు పక్కనే తింటున్న దృశ్యాలతో పాటు.. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఈ వీడియోను రూపొందించారు. 
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు పాటిద్దాం.. మన దేశాన్ని రక్షించుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం.. అనే సందేశంతో ఈ వీడియో ముగుస్తుంది. 
► పోలీసులకు 50 వేల మాస్కులు అందించిన ‘స్పిన్‌టెక్స్‌’
► పోలీస్‌ సిబ్బంది కోసం స్పిన్‌టెక్స్‌ లిమిటెడ్‌ అధినేత ఎంవీ సుధాకర్‌ 50 వేల మాస్క్‌లను అందించారు. 
► మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శనివారం డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌కు వీటిని అందజేశారు. 
► పోలీస్‌ శాఖలోని నాలుగు వేల మంది మహిళలకు, వారి కుటుంబాలకు వీటిని అందజేయాలని పోలీస్‌ అధికారులను డీజీపీ ఆదేశించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు