ఎన్నికలకు ‘మంద’స్తు నిల్వలు..

22 Feb, 2019 08:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల కోడ్‌ రాకముందే భారీగా మద్యం నిల్వలు చేసేందుకు సిండికేట్లు సన్నద్ధమయ్యారు. మొన్నటి వరకు బెల్టు షాపులుగా కొనసాగిన మద్యం గోడౌన్లు రాబోయే రెండు నెలల పాటు భారీగా నిల్వ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే మద్యం వ్యాపారుల డిమాండ్‌ మేరకు ఏపీబీసీఎల్‌ నుంచి సరుకు సరఫరా చేసే అవకాశం ఉండదు. గత ఏడాదిలో ఆ నెలకు సంబంధించి ఎంత మేర వ్యాపారం చేశారో అంతకు పది శాతం అధికంగా మాత్రమే సరుకు సరఫరా చేస్తారు. ఆ మేరకు మాత్రమే వ్యాపారుల నుంచి డీడీలు స్వీకరిస్తారు. గతేడాది రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జనవరి నెలకు సంబంధించి రూ.1,690 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది జనవరిలో రూ.2 వేల కోట్లకు పైగా సరుకు కొనుగోలు జరిగింది.

గతేడాది ఫిబ్రవరి నెలలో రూ.1,338 కోట్ల విలువైన మద్యం సరఫరా ఏపీబీసీఎల్‌ నుంచి జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నాటికే ఏపీబీసీఎల్‌ నుంచి రూ.1.004 కోట్ల విలువైన సరుకు కొనుగోలు చేశారు. మద్యం వ్యాపారంలో మెజార్టీ శాతం అధికార పార్టీ నేతలే ఉన్నారు. రాష్ట్రంలోని 4,380 మద్యం షాపుల్లో సరుకు కొనుగోళ్ల వివరాలు సరిగా లేకపోవడం గమనార్హం. గతంలో మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు, ఆన్‌లైన్‌ మద్యం విక్రయాలు చేపట్టేలా ఓ ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. అయితే ప్రస్తుతం ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. అసలు మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు పర్యవేక్షించే అవకాశమే ఇప్పుడు లేకుండా పోయింది. దీంతో మద్యం సిండికేట్లు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారీగా నిల్వలు చేసే పనిలో పడ్డారు.

గోడౌన్ల తనిఖీ వదిలేసిన అబ్కారీ శాఖ
మద్యం నిల్వ చేసుకునేందుకు గతంలో ప్రభుత్వం గోడౌన్లకు లైసెన్సులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గోడౌన్లు మొన్నటివరకు బెల్టు షాపులుగా ఉపయోగపడ్డాయి. ఎన్నికల అవసరాల దృష్ట్యా రోజు వారీ మద్యం విక్రయాలను కొంత మేర తగ్గించి ఈ గోడౌన్లలో సరుకు దాచేస్తున్నారు. ఎరువులకు, నిత్యావసరాలు దాచేందుకు వినియోగించే గోడౌన్లలోనూ మద్యం దాస్తున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా మద్యం సరఫరా, అమ్మకాలపై దృష్టి సారించాల్సిన ఎక్సైజ్‌ అధికారులు అసలు పట్టించుకోలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం కావడం గమనార్హం. ఇటు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం తనిఖీలను పూర్తిగా అటకెక్కించింది.   

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లివ్ అండ్ లెట్ లివ్ మా విధానం : కేసీఆర్‌

కుప్పంలో భారీ వర్షం..రైతు మృతి

గురువారం మే 30.. మధ్యాహ్నం 12.23..

రాయపాటికి ఘోర పరాభవం

వైఎస్‌ జగన్‌ దంపతులకు కేసీఆర్‌ ఘన స్వాగతం

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: జగన్

వాళ్లకు మనకు తేడా ఏంటి : విజయసాయి రెడ్డి

వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార వేదిక ఖరారు

అది తప్పు.. సెల్యూట్‌ నేనే చేశా: గోరంట్ల మాధవ్‌

వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌..

ఏయే శాఖల్లో ఎన్ని అప్పులు తీసుకున్నారు?

వైఎస్‌ జగన్‌తోనే ఉద్యోగుల సమస్యలు తీరుతాయి

వైఎస్‌ జగన్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదల

మార్పు.. ‘తూర్పు’తోనే..

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం: వైఎస్‌ జగన్‌

ఉమాశంకర్‌గణేష్‌కు సోదరులు పూరీ స్వాగతం

అందుకే నాది గోల్డెన్‌ లెగ్: ఎమ్మెల్యే రోజా

విజయవాడ ప్రజలతోనే ఉంటా : పీవీపీ

సంతాన 'మా'లక్ష్మి.. కు.ని. అంటే భయమట!

వైఎస్సార్‌ఎల్పీ నేతగా వైఎస్‌ జగన్‌

కొత్త కొత్తగా ఉన్నది

జైలు నుంచి శ్రీనివాసరావు విడుదల

థైరాయిడ్‌ టెర్రర్‌

దుర్గగుడి పాలకమండలి సభ్యుల రాజీనామా

భువనేశ్వరి దత్తత గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ!

లగడపాటి ‘చిలకజోస్యానికి’ వ్యక్తి బలి

ఆ ఆరు స్థానాల్లో టీడీపీ విజయం

టీడీపీకి అచ్చిరాని ‘23’!

ఆంధ్రప్రదేశ్‌కు ఇక శుభదినాలే

‘దేశం’లో అసమ్మతి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ