17 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

15 May, 2018 13:02 IST|Sakshi
పాలిసెట్‌ వివరాలను వెల్లడిస్తున్న పాలిసెట్‌ జిల్లా కన్వీనర్‌ జెడ్‌.రమేష్‌బాబు

రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాలు ఏర్పాటు జిల్లాలో ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ 20 నుంచి 25వ తేదీ వరకుఆప్షన్లకు అవకాశం 26వే తేదీ ఆప్షన్లు మార్చుకునేందుకు సౌలభ్యం 28న సీట్ల కేటాయింపుఉత్తర్వులు జారీ పాలిసెట్‌ జిల్లా కన్వీనర్‌ జెడ్‌.రమేష్‌బాబు

ఒంగోలు:  పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని పాలిసెట్‌ జిల్లా కన్వీనర్, ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ జెడ్‌.రమేష్‌బాబు తెలిపారు. తన చాంబర్‌లో సోమవారం ఉదయం  విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గత కౌన్సెలింగ్‌కు, ఈ దఫా కౌన్సెలింగ్‌కు పలు మార్పులు జరిగాయని, అభ్యర్థులు కౌన్సెలింగ్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి:
ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణతకు సంబం«ధించి ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన ఒరిజినల్‌ మార్కుల మెమో
ఆధార్‌ కార్డు( పరిశీలన సమయంలో ఒరిజినల్‌ కార్డు పరిశీలన)
4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు (లేదా) నాలుగు నుంచి పది వరకు విద్యాసంస్థలలో చదవకపోయి ఉంటే వారు రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ అందజేయాలి. ఒక వేళ ఈ రాష్ట్రంలో నివాసం ఉండనివారు అయితే వారి తల్లిదండ్రులు కనీసం పది సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్‌లో నివాసం ఉన్నట్లు నిరూపించే రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జతచేయాలి
జనవరి 1వ తేదీ తరువాత జారీచేసిన «ఆదాయ ధృవీకరణ పత్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన తెల్లరంగు రేషన్‌ కార్డు(ఫీజు రీయింబర్స్‌మెంట్‌  అర్హత ఉన్నవారు)
పర్మినెంట్‌/ ఆరు నెలలలోగా సంబంధిత అధికారి జారీచేసిన కుల ధృవీకరణ పత్రం
అంగవైకల్యం కలిగిన వారు 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నట్లు జిల్లా మెడికల్‌ బోర్డు జారీచేసిన ధృవపత్రం
చిల్డ్రన్‌ ఫర్‌ ఆర్మ్‌డ్‌ పర్సనల్‌(క్యాప్‌) అభ్యర్థులు మాజీ సైనికులకు సంబంధించి జిల్లా సైనిక సంక్షేమశాఖ జారీచేసిన ధృవపత్రం, ఐడెంటిటీ కార్డు, డిశ్చార్జిబుక్‌ వెరిఫికేషన్‌ నిమిత్తం తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
ఆంగ్లో ఇండియన్‌ కేటగిరీకి సంబంధించి వారు నివాసం ఉంటున్న ప్రదేశానికి సంబంధించి రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జతచేయాల్సి ఉంటుంది
స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులు కౌన్సెలింగ్‌ నిమిత్తం విజయవాడ  బెంజ్‌ సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, విశాఖపట్నంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ తిరుపతిలోని ఎస్‌వి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

ఫీజు వివరాలు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300, బీసీ/ఓసీ అభ్యర్థులు రూ.600 ఫీజు నగదు రూపంలో కౌన్సెలింగ్‌ సెంటర్‌లో చెల్లించవచ్చు. ప్రభుత్వ లేదా ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశం పొందిన వారికి రూ.3800 , ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పొందిన వారు రూ.15500 నుంచి రూ.21వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీటు పొందిన తరువాత ఏపీ స్టేట్‌ బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌కు రూ.800 చెల్లించాలి. 

ఆప్షన్లు ఇలా..ఈ నెల 20వ తేదీ నుంచి ఆప్షన్లను ఒంగోలులోని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ(ఈ కాలేజీ అవకాశం కల్పిస్తుంది), లేదా ఇతరత్రా ప్రైవేటు నెట్‌ సెంటర్ల నుంచి కూడా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 20, 21 తేదీల్లో ఒకటవ ర్యాంకు మొదలు 30వేల వరకు, 22,23 తేదీల్లో 30001 మొదలు 60వేల వరకు, 24, 25 తేదీల్లో 60001 మొదలు చివరి ర్యాంకు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా తమ ఆప్షన్లు మార్చుకోవాలని భావిస్తే ఈ నెల 26న మార్చుకోవచ్చు. 28వతేదీ సాయంత్రం 6గంటల తరువాత సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. కేటాయించిన సీటుకు సంబంధించిన ఉత్తర్వులను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అభ్యర్థి తప్పనిసరిగా ఐసీఆర్‌ ఫారం నెంబర్, హాల్‌టిక్కెట్‌ నెంబర్, పాస్‌వర్డు, పుట్టిన తేదీతో లాగిన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని సీటు లభించిన కాలేజీలో రిపోర్టుచేయాల్సి ఉంటుంది.

కోర్సులు ఇవి మాత్రమే:ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ : సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌
ఈతముక్కల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ : ఈసీ, కంప్యూటర్స్, డీసీసీసీపీ
కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ : సివిల్, ఎలక్ట్రికల్‌
అద్దంకి పాలిటెక్నిక్‌ కాలేజీ : కంప్యూటర్స్, ఈసీ
ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో: సివిల్, మెకానికల్, ట్రిపుల్‌ ఇ, ఈసీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో ఇటీవల పలు కొత్తకోర్సులు వస్తున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే వాటికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రానందున గత ఏడాది ఏ కోర్సులు అయితే ఉన్నాయో వాటికి మాత్రమే  ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపారు.

మరిన్ని వార్తలు