'కాంగ్రెస్ గుర్తించకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే ఉండేవాడివి'

14 Jan, 2014 12:40 IST|Sakshi
'కాంగ్రెస్ గుర్తించకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే ఉండేవాడివి'

కరీంనగర్: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని విమర్శిస్తున్న సీమాంధ్ర నాయకులు ఆయన కాలిగోటికి కూడా సరిపోరని ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. యాబై ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉంటూ, మచ్చలేని నాయకుడైన జైపాల్‌రెడ్డిని.. ఆయన భాషలోనే చెప్పాలంటే కొంతమంది శుంఠలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మిత్రుడని, కాంగ్రెస్ గుర్తించి ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు అనువాదకుడి పోస్టు ఇచ్చిందన్నారు. లేదంటే గొంతు బాగుంది కనుక సినిమాలకు డబ్బింగ్ చెప్పుకొంటూ, ఆటోలో మైక్‌ద్వారా సినిమా ప్రచారం చేసుకొంటూనో ఉండేవాడని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర నాయకులు జైపాల్‌రెడ్డికి క్షమాపణ చెబితే కొంతైనా శుంఠల స్థాయిని తగ్గించుకుంటారన్నారు.

మరిన్ని వార్తలు