మాటలకు చేతలకు.. పొంతనకుదిరేనా?

5 Sep, 2014 01:55 IST|Sakshi
మాటలకు చేతలకు.. పొంతనకుదిరేనా?
  • సీఎం ప్రకటనపై నిపుణుల సందేహం
  •  తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని తొలుత చెప్పి,
  •  ఇప్పడు మాట మార్చిన బాబు
  •  రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం శ్రీకారం
  •  తిరుపతిలో ఐటీఐఆర్‌నూ ఏర్పాటుచేస్తామని ఒకసారి.. ఐటీ హబ్‌గా మార్చుతామని మరోసారి భిన్నమైన ప్రకటనలు
  •  కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు చేస్తామన్న ఐఐఏ చైర్మన్ అలోక్ సిన్హా.. కాదు విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్న బాబు
  •  శాసనసభలో  హామీలకు నిధులేవి?
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు శాసనసభలో గురువారం ఇచ్చిన హామీల అమలుపై నిపుణులు, రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నా రు. సీఎం చంద్రబాబు జిల్లా ప్రగతిపై గతంలో ఒకలా.. గురువారం మరోలా భిన్నమైన ప్రకటనలు చేయడాన్ని వారు ఉదహరిస్తున్నారు. శాసనసభలో గురువారం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్న అంశాన్ని నిపుణులు గుర్తు చేస్తుండటం గమనార్హం.

    వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక జూన్ 16న విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ వర్శిటీలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. జూన్ 24న తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని.. కుప్పంలో విమానాశ్రయం, తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. గురువారం శాసనసభలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలో మాత్రం సెంట్రల్ వర్శిటీని అనంతపురంలో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

    తిరుపతిలో ఐటీఐఆర్ కాదు.. ఐటీ హబ్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పుకొచ్చారు. ఇటీవల ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఐఏ) ఛైర్మన్ అలోక్ సిన్హా కుప్పంలో పర్యటించి.. ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు. ఆగస్టు 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. గురువారం చంద్రబాబు చేసిన ప్రకటన తద్భిన్నంగా ఉంది. కుప్పంలో ఎయిర్‌పోర్టును ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. గతంలో చంద్రబాబు చేసిన ప్రకటనకూ.. శాసనసభలో ఇచ్చిన హామీలకు పొంతన కుదరకపోవడంతో వాటి అమలుపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
     
    అంతా తమ గొప్పగా చెప్పుకునే యత్నం..:

    తిరుపతికి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయానికి రూ.వంద కోట్లతో అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు సెప్టెంబరు 26, 2010న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు. ఆ పనులు ఇప్పటికే చేపట్టారు. ఇటీవ ల రేణిగుంట విమానాశ్రయాన్ని పరిశీలించిన ఐఐఏ ఛైర్మన్ అలోక్‌సిన్హా అంతర్జాతీయ విమానాశ్రయంగా రేణిగుంట ఎయిర్‌పోర్టును మార్చలేమని స్పష్టీకరించారు. కేవలం అంతర్జాతీయహోదా కల్పించే పనులే చేయవచ్చునని చెప్పారు. కానీ.. చం ద్రబాబు మాత్రం రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తామని ప్రకటించారు.

    అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలంటే కనీసం 4,500 ఎకరాల భూమి అవసరం. కానీ.. అక్కడ ఆ మేరకు భూమి అందుబాటులో లేకపోవడం గమనార్హం. చిత్తూరులో అపో లో హెల్త్‌సెంటర్ ఏర్పాటుకు తొమ్మిదేళ్లక్రితమే ఆ సంస్థకు ప్రభుత్వం భూ మి కేటాయించింది. ఆ సంస్థ అక్కడ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఆ సంస్థ ను తామే ఏర్పాటుచేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. కేం ద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఐఐటీని మంజూరు చేసింది. ఆ ఐఐటీ నే తిరుపతిలో ఏర్పాటుచేస్తామనిబాబు చెప్పారు.

    కేంద్రం ఐఐఎస్‌ఈ ఆర్‌ను రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కానీ.. అవేమీ పట్టకుండా తిరుపతిలో ఐఐఎస్‌ఈఆర్‌ను ఏర్పాటుచేస్తామని ప్రకటిచండం గమనార్హం. ఏ ర్పేడులో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్ జోన్(ఎన్‌ఐఎమ్‌జెడ్) ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కానీ.. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన శ్రీకాళహస్తి స్పైన్‌పై మాత్రం చంద్రబాబు స్పందించలేదు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక మేరకు రూ.1,500 కోట్లతో శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాన్ని పూర్తిచేస్తేనే ఏర్పేడులో ఎన్‌ఐఎమ్‌జెడ్ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని నిపుణులు తేల్చిచెబుతున్నారు.
     
    బడ్జెట్‌లో నిధులేవీ?
     
    తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని గురువారం శాసనసభలో సీఎం ప్రకటించారు. మెట్రోరైల్‌ను కూడా తి రుపతికి తీసుకొస్తామని చెప్పారు. కానీ.. ఇటీవల విశాఖపట్నం, విజయవాడ-తెనాలి-గుంటూరులకు మాత్రమే మె ట్రోరైల్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పడు తిరుపతిలో మెట్రో రైల్‌ను ఏర్పాటుచేసే అంశంపై చంద్రబాబు స్పందించలేదు. మెగా సిటీకి కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పిన చంద్రబాబు.. మెట్రో రైల్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులను వెచ్చించాలని చెప్పకనే చెప్పా రు.

    కానీ.. మెట్రో రైల్ ప్రాజెక్టుకు బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇక జిల్లాలో హార్టికల్చర్ జోన్.. ఫుడ్ పార్క్‌లను ఏర్పాటుచేస్తామని చంద్రబాబు ప్ర కటించారు. మామిడి తోటలు విస్తారంగా ఉన్న జిల్లాలో హార్టికల్చర్ జోన్ ఏర్పాటుచేయడం ఆహ్వానించదగ్గదే. ఫుడ్ పార్క్‌దీ అదే పరిస్థితి. కానీ.. తిరుపతి-శ్రీకాళహస్తి-కాణిపాకం ఇప్పటికే ఆధ్మాత్మిక కారిడార్‌గా అనధికారిగా అభివృద్ధి చెందింది.

    ఇప్పుడు ఆ కారిడార్‌నే అధికారికంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చే హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ, స్వరముఖి-సోమశిల లింక్ కెనాల్ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేదు. వీటిని పరిశీలించిన నిపుణులు బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా చంద్రబాబు వ్యహరిస్తోన్న తీరును చూస్తే మాటలకు చేతలకు పొంతన కుదిరేట్టు లేదనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు