చినుకు పడితే కునుకు లేనట్టే..

22 Nov, 2018 12:32 IST|Sakshi
నీరు చేరడంతో దిగాలుగా కూర్చున్న సుబ్రమణ్యం దంపతులు నీరు బయటపోస్తున్న మునెమ్మ

పస్తులతో జాగారమే...

గూడు కోసం అర్జీలిచ్చి అలసిపోయాం

ఓ పేద దంపతుల వేదన

చిత్తూరు, రేణిగుంట: ‘అది రేణిగుంట మండలం కృష్ణాపురం ఎస్టీ కాలనీ. అందులో చిన్నగాలికే ఎగిరిపోయిన పైకప్పు ఉన్న ఓ పూరిపాక.. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో చినుకు బయటపడితే ఒట్టు... అందులో మునె మ్మ, సుబ్రమణ్యం దంపతులు విరిగి పోయి అతుకుల బొంతను తలపించే ఓ మంచంపై కూర్చుని తడుస్తూనే ఉన్నారు. కంటి మీద కునుకు లేకుండా పస్తులతో మంచానికి అతుక్కుపోయి కనిపించారు. వీరొక్కరే కాదు... కాలనీ లోని అధికశాతం మంది పరిస్థితి ఇదే స్థాయిలో కనిపిస్తోంది. గుడిసెలు లేని నవ్యాంధ్రను నిర్మిస్తానని చెప్పుకునే పా లకులకు వీరి దుర్గతి ఓ చెంపపెట్టు.’

వానొస్తే రైతులకు ఆనందమే కానీ తమకు మాత్రం భయాందోళన కలుగుతుందని వీరు చెప్పుకొస్తున్నారు. పేదరికంలో పుట్టడమే పాపంగా జీవితాంతం కష్టాలను అనుభవిస్తున్నామని బో రుమంటున్నారు. చిన్నపాటి ఇల్లు కట్టుకుందామని ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించున్న వారే లేరని ఆవేదన చెందారు. ఓట్లు వేసుకునేందుకు వచ్చే నాయకులు కష్టసమయాల్లో కనిపించరని వాపోయారు. పలుకుబడి, అధికా రులకు ఇచ్చుకునేంత డబ్బు తమ వద్ద లేకపోవడం వల్లే తమ అర్జీలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బతుకుల్లోకి తొంగిచూస్తే కష్టాల కడలి లోతెంతో తెలుస్తుందన్నారు.

మరిన్ని వార్తలు