రిజిస్ట్రేషన్‌.. ఫ్రస్టేషన్‌

28 May, 2020 11:47 IST|Sakshi
ఎండలో చెట్ల కింద కూర్చొన్న ప్రజానీకం

ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వాటిల్లో రిజిస్ట్రేషన్‌‌ శాఖ ఒకటి. క్రయ–విక్రయాల నిమిత్తం ఈ కార్యాలయాలకు నిత్యం ఎంతో మంది వచ్చి వెళ్తారు. వీళ్లకు కావల్సిన సౌకర్యాలను అక్కడి సిబ్బంది సమకూర్చాల్సి ఉంది. కానీ మచిలీపట్నంలో అందుకు విరుద్ధంగా సాగుతోంది.  లాక్‌డౌన్‌  సాకుతో ఇక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రధాన గేటుకు తాళాలు వేస్తున్నారు. దీంతో వచ్చే వారు లోపలకి వెళ్లేందుకు నానా ఇబ్బందీ పడుతున్నారు. ఇక్కడ అతి జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు, కార్యాలయం లోపల మాత్రం భౌతిక దూరం విషయంలో ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కార్యాలయానికి వచ్చే వారు వేచి ఉండేందుకు అందుబాటులో రేకులు షెడ్డు ఉన్నప్పటికీ, ఫ్యాన్‌లు తిరగకపోవటంతో, ఎండవేడిమి తాళలేక అక్కడి నుంచి వచ్చేసి, ప్రాంగణంలోని చెట్లు క్రింద కూర్చుంటున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం ఇక్కడ నెలకొన్న సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.  
–సాక్షి ఫొటోగ్రాఫర్, మచిలీపట్నం 

 
పనిచేయని ఫ్యాన్లు 


చెట్ల నీడే దిక్కు! 

మరిన్ని వార్తలు