పోరాటాలతోనే ప్రభుత్వంపై ఒత్తిడి

30 Jan, 2015 03:45 IST|Sakshi
పోరాటాలతోనే ప్రభుత్వంపై ఒత్తిడి
  • 25 గంటల దీక్ష ముగింపులో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
  • ఉరవకొండ నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఐదేళ్ల వరకూ ఎలాంటి ఎన్నికలు లేవు. హంద్రీ-నీవా ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయూలని నేను చేస్తున్న దీక్షకు భారీగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వామపక్షాల, ప్రజా, కుల సంఘాల నేతలు తరలివచ్చారు. ఇంత మంది సంఘీభావం తెలిపారంటే ఈ ప్రాజెక్టు ఎంత ముఖ్యమైందో అర్థమవుతోంది. దీక్ష తో ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. హంద్రీ-నీవా గురించి మంత్రులు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు.

    పోరాటాలతోనే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం’ అని వైఎస్సార్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హంద్రీ-నీవా పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు 100 టీఎంసీల నికర జలాలను కేటాయించి ఈ ఖరీఫ్ నుంచే నీరు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆ యన అనంతపురం జిల్లా ఉరవకొండలో చేపట్టిన 25 గంటల దీక్ష గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఎమ్మెల్సీ దేవగుడి నా రాయణరెడ్డి, సీనియర్ జర్నలిస్టు శ్రీనాథరెడ్డి లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
     
    ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమిస్తాం

    ‘చంద్రబాబు హాయాంలో రెండుసార్లు హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేసి విస్మరించారని,  ఆయున హాయాంలో రూ. 24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని  కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అన్నారు. దీక్ష వేదికపై ఆయున వూట్లాడారు.

మరిన్ని వార్తలు