ప్రజల వద్దకే ‘అపోలో అట్ హోం’

10 May, 2014 01:56 IST|Sakshi
  • అపోలో సంస్థల యజమాని
  •  ప్రతాప్ సీ రెడ్డి
  •  తిరుమల, న్యూస్‌లైన్ : ప్రజల వద్దకే చికిత్సను తీసుకువెళ్లేందుకు ‘అపోలో అట్ హోం’ అనే కార్యక్రమానికి త్వరలో శ్రీకా రం చుట్టనున్నట్లు ఆ సంస్థ యజమాని ప్రతాప్ సీ రెడ్డి వె ల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు దగ్గరుండి స్వామి దర్శనాన్ని కల్పించారు. అనంత రం ప్రతాప్ సీ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

    తిరుమల శ్రీవారి ఆశీస్సులతో అపోలో ఆస్పత్రులు విజయవంతంగా ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాయన్నారు. చిత్తూరు జిల్లా అరగొండకు సమీపంలో ఉన్న అపోలో ఆస్పత్రిలో సుమారు 70 వేల మందికి అన్ని రకాల వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. నాన్ కమ్యునికబుల్ డిసీస్(ఎన్‌సీడీ), డయాబెటిస్, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ వంటి ప్రధానమైన నాలుగు సమస్యలతో ఏడాదికి 36 మిలియన్ల మంది మృతి చెందుతున్నారన్నారు.

    ఈ సమస్యలకు ముందుగానే పరిష్కారాన్ని కనుగొనాలనే లక్ష్యం తో ‘టోటల్ హెల్త్ ప్రాజెక్ట్’ రూపొందిస్తున్నామని చెప్పారు. అలాగే అప్పుడే పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయ్యే వరకు ఎటువంటి రోగాలు సోకకుండా ఎలా సంరక్షించాలి అనే విషయాలపై కూడా పూర్తి ప్రణాళికను రూపొందిస్తున్నామని వెల్లడించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన అపోలో హృదయ అత్యవసర చికిత్స కేంద్రంలో అనేక మంది శ్రీవారి భక్తులు ఉచితంగా చికిత్స పొందుతున్నారని చె ప్పారు. శబరిమళై, పూరిలో కూడా ఉచిత హృదయ అత్యవసర చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
     

మరిన్ని వార్తలు