జగన్‌ది జనరంజక పాలన

1 Aug, 2019 01:47 IST|Sakshi

నటుడు పోసాని కృష్ణమురళి

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా సమర్థవంతంగా పాలన కొనసాగిస్తున్నారని సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కొనియాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, ప్రజా ప్రాధాన్యాన్ని బట్టి నిధులను కేటాయి స్తున్నారన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మినహా 1983 నుండి నేను చూసిన అందరి సీఎంల కంటే జగన్‌ మంచి పరిపాలనను అందిస్తున్నారని తెలిపారు. ఆయన రెండు నెలల పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, రెండునెలల్లోనే ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిందించడం తప్పని అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం కోసం తన వంతుగా సేవలందించానని, పదవుల కోసం ఏమాత్రం చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ తన సేవల్ని గుర్తించి పదవి ఇస్తే నటనకు విరామమిచ్చి సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. 

ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా...
తన ఆరోగ్యం పట్ల సోషల్‌మీడియా, యూట్యూబ్‌లలో వస్తున్న వార్తలను ఖండించారు. రెండు నెలల క్రితం హెర్నియా వ్యాధి వల్ల ఆపరేషన్‌ జరిగిందని పోసాని తెలిపారు. ఆపరేషన్‌ తర్వాత ఇన్‌ఫెక్షన్‌ వల్ల మరింతగా అనారోగ్యానికి గురయ్యా నని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానన్నారు. ఆ సమ యంలో చనిపోతానని అనుకున్నానని, 10కిలోల బరువు తగ్గానని వివరించారు. లోకేష్‌ ఖాళీగా ఉన్నాడు కాబట్టి ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు