ఇక... పోస్టల్ ఏటీఎం సెంటర్లు!

22 Dec, 2013 07:10 IST|Sakshi


 
 జిల్లాలో మొదటగా 5 కేంద్రాలు
 హెడ్ పోస్టాఫీసుల్లో ఏర్పాటు
 హన్మకొండ, వరంగల్, జనగాం, పరకాల,     మహబూబాబాద్‌లో పరిశీలన పూర్తి
 తీరనున్న ఖాతాదారుల వెతలు
 
 హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్  : టెలిఫోన్, సెల్‌ఫోన్ల ప్రభావంతో పోస్ట ల్ శాఖలో కీలకమైన టెలిగ్రాం వ్యవస్థ మూతపడితే... ప్రైవేట్ కొరియర్లతో పోస్టు కార్డు జో రు తగ్గిన విషయం తెలిసిందే. వీటికి తోడు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల పోటీకి పోస్టాఫీసుల్లో పొదుపు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. అ న్ని విధాలుగా వెనుకబడిన పోస్టల్ శాఖ... ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. తాజాగా ఏటీఎం సెంటర్లను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. సేవింగ్స్ బ్యాంక్ (ఎస్‌బీ) ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
 
 జిల్లాలో ఐదు ఏటీఎం సెంటర్లు
 జిల్లాలో హన్మకొండ, వరంగల్ డివిజన్లుగా పోస్టల్ శాఖ కార్యకలాపాలను నిర్వహిస్తోం ది. హన్మకొండ డివిజన్ పరిధిలో జనగాం, పరకాల, హన్మకొండలో మూడు హెడ్ పోస్టాఫీసులుండగా... 47 సబ్ పోస్టాఫీసులున్నా యి. మరో 372 బ్రాంచీల్లో పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్నారుు.  వరంగల్ డివిజన్ పరిధిలో వరంగల్‌తోపాటు మహబూబాద్‌లలో హెడ్ పోస్టాఫీసులు, 41 సబ్ పోస్టాఫీసులుండగా... 300 బ్రాంచీలున్నా రుు. మొదటగా జిల్లావ్యాప్తంగా ఐదు హెడ్ పోస్టాఫీసు ల్లో ఏటీఎం సెంటర్ల ఏర్పాటుకు పోస్టల్ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. నెల రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఇన్ఫోసిస్, సిఫి కంపెనీల ఇంజినీర్ల బృందం ఇటీవల హన్మకొండ, వరంగల్, జనగాం, పరకా ల, మహబూబాబాద్ పోస్టాఫీసులను పరిశీ లించింది.
 
 అంతేకాకుండా... పోస్టల్ శాఖ అధికారులు హెడ్ పోస్టాఫీసుల పరిధిలో ఎస్‌బీ ఖాతాల వివరాలను కంప్యూటర్‌లో పొందుపరిచే ప్రక్రియను కూడా చేపట్టారు.  ఈ మేరకు వచ్చే ఏడాదిలో పోస్టల్ ఏటీఎంలను నెలకొల్పనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నారుు. జిల్లాలో దాదాపు ఆరు లక్షల మంది సేవింగ్ బ్యాంక్ ఖాతాదారుల ఉన్న ట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ ఏటీఎంలు అందుబాటులోకి వస్తే... వినియోగదారులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన బాధ తీరినట్లే. అంతేకాదు... వారు తమ తమ ఖాతాల్లో ఎప్పుడైనా నగదు వేసుకోవచ్చు.... ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు