ఓటమి భయంతోనే ఎన్నికలు వాయిదా

27 Jan, 2017 22:31 IST|Sakshi
ఓటమి భయంతోనే ఎన్నికలు వాయిదా
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఓటమి భయంతోనే కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాయిదా వేస్తూ వస్తున్నారని  కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కళావెంకట్రావ్‌ భవనం, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం నగర అధ్యక్షుడు సర్దార్‌ బుచ్చిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే పునాదులన్నారు. పార్టీలను ఫిరాయించిన వారిని ప్రజలు క్షమించబోరన్నారు. ప్రభుత్వం జన్మభూమి కమిటీలను రద్దు చేసి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నారు.
 
20 సూత్రాల పథకం మాజీ చైర్మన్‌, జిల్లా ఇన్‌చార్జి తులసి రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి, మైనారిటీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్‌అలీఖాన్‌లు తదితరులు.. కర్నూలు నగర కాంగ్రెస్‌ కమిటీని, వార్డు కమిటీ ఇన్‌చార్జీలను ప్రకటించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ సత్తార్, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, జెడ్పీ మాజీ చైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి , డీసీసీ ఉపాధ్యక్షులు వై.వి.రమణ, ప్రధాన కార్యదర్శులు కె.పెద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు