పోస్టులు 6.. దరఖాస్తులు 176

31 Jul, 2014 04:18 IST|Sakshi

ఔట్ సోర్సింగ్ పోస్టులకూ తీవ్ర పోటీ
కడప కార్పొరేషన్: ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత తీవ్రమైన పోటీ ఉందో, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు కూడా అంతే తీవ్ర పోటీ నెలకొందనడానికి పైన పేర్కొన్న అంకెలే స్పష్టం చేస్తాయి. పట్టణ పేదరిక నిర్మూలణ  సంస్థ (మెప్మా)లో ఇటీవల 6 ఔట్ సోర్సింగ్ పోస్టుల భ ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తే 176 దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు అర్హత పీజీ డిగ్రీ, ఎంఎస్ కంప్యూటర్స్ వంటి ఉన్నత విద్య చదివి ఉండాలని నిబంధన విధించిన నేపథ్యంలో ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ చదివిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయడం విశేషం.

జిల్లా లైవ్‌లీ హుడ్ స్పెషలిస్టు(ఎస్సీ మహిళ) ఒక పోస్టుకు 36 మంది, మిస్‌లేనియస్ అసిస్టెంట్(ఎస్సీ మహిళ) ఒక పోస్టుకు 22 మంది దరఖాస్తు చేశారు. జూనియర్ స్పెషలిస్టు(ఓసీ జనరల్) ఒక పోస్టు ఉండగా దీనికి అత్యధికంగా 101 మంది దరఖాస్తు చేశారు. ఇక పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులలో కమ్యునిటీ ఆర్గనైజర్ పోస్టులు మూడు ఉండగా ఒకటి బీసీ-సీకి, మరొకటి బీసీ-డీకి, ఇంకోటి బీసీ-ఈ కి కేటాయించారు.  ఈ మూడు పోస్టులకు వరుసగా ఏడు, ఆరు, నాలుగు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో వారి మార్కుల ఆధారంగా అర్హుల జాబితా ప్రకటించి ఇంటర్వ్యూలకు పిలవనున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు