స్త్రీలకు అన్ని రంగాల్లో సమాన భాగస్వామ్యం

2 Mar, 2014 00:25 IST|Sakshi
స్త్రీలకు అన్ని రంగాల్లో సమాన భాగస్వామ్యం

హైదరాబాద్, న్యూస్‌లైన్: మహిళలకు రాజకీయ, ఆర్థిక రంగాల్లో సమాన భాగస్వామ్యం కల్పించాలని ప్రొఫెసర్ రమా మెల్కొటె పేర్కొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర మహాసభలు పురస్కరించుకొని శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మెల్కొటె మాట్లాడుతూ.. రాజ్యాంగపరంగా మహిళలకు దక్కాల్సిన హక్కులకు దేశంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ.. స్త్రీల హక్కులను సమాజం గుర్తించాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా పాలకులు తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. ఇందిరాగాంధీ 18 ఏళ్లు ప్రధానిగా ఉన్నా.. మహిళల కోసం ఒక్క చట్టం కూడా చేయలేదని విమర్శించారు.

 

మహిళలను దేవతలుగా కాకుండా మనుషులుగా గుర్తించాలన్నారు. మహిళలపై హింస, వేధింపులను నివారించేందుకు ఎమర్జెన్సీ సర్వీసు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సభలో విప్లవ రచయిత్రి విమల, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర నాయకురాలు పి. టాన్యా, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. విష్ణు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు