14 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె

12 Feb, 2014 04:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఒకటే వేతన సవరణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ 14వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్టు విద్యుత్ ఉద్యోగులు ప్రకటించారు. ఈ నెల 12, 13 తేదీల్లో వర్క్ టు రూల్ పాటించడంతో పాటు నిరాహార దీక్షలు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మంగళవారం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యదర్శి అజయ్ కల్లాంతో పాటు ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్‌కో ఎండీ విజయానంద్‌లకు సమ్మె నోటీసును అందజేసినట్టు జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు, చైర్మన్ సీతారామరెడ్డి, కో చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు చెప్పారు. ఇప్పటికే విద్యుత్ ప్లాంట్లల్లో బొగ్గు నిల్వలు తక్కువగా ఉండటం, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె యోచనపై ఆందోళన వ్యక్తమవుతోంది.    
          
 ఉద్యోగుల డిమాండ్లు..   
 ్హ జెన్‌కో, ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వేర్వేరుగా మూడు వేతన సవరణ కమిటీలు వేయాలన్న ఇంధనశాఖ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి. ్హ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) ను మూడు ముక్కలు చేసినప్పటి నుంచి ఒకే వేతన సవరణ కమిటీ ద్వారా సవరణ జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా చేయూలి. మూడు కమిటీలను అంగీకరించేది లేదు.
 ్హ  వేతన సవరణ కమిటీలో బయటి వ్యక్తులు సభ్యులుగా ఉండకూడదు. ్హ ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల వేతనాలతో పోల్చిచూడాలన్న ఇంధనశాఖ ఆదేశాల్ని రద్దు చేయాలి.

>
మరిన్ని వార్తలు