విద్యుత్ సమ్మె యోచన విరమణ!

14 Feb, 2014 02:44 IST|Sakshi

ఉద్యోగుల డిమాండ్లకు ఇంధనశాఖ అంగీకారం
ఒకే వేతన సవరణ కమిటీ.. మార్చి 31 నాటికి నివేదిక

 
 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు సమ్మె యోచన విరమించుకున్నారు. తమ డిమాండ్లపై యాజమాన్యంతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే వేతన సవరణ కమిటీ ఏర్పాటుకు అంగీకరించడంతో పాటు మార్చి 31 నాటికి నివేదిక సమర్పించేందుకు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు, చైర్మన్ సీతారామరెడ్డి, కో చైర్మన్ మోహన్‌రెడ్డి, విద్యుత్ సౌధ జేఏసీ కన్వీనర్ కళ్లెం శ్రీనివాసరెడ్డి, వెంకన్నగౌడ్, గణే శ్‌రావు, భానుప్రకాశ్, వేదవ్యాసరావు ప్రకటించారు.
 
 ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలకు వేర్వేరుగా మూడు వేతన సవరణ కమిటీల ఏర్పాటు, కమిటీల్లో బయటి వ్యక్తుల నియామకం, ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ అంశాలపై ఇంధనశాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 నుంచి నిరవధిక సమ్మె చేయూలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణరుుంచుకున్నారు. అరుుతే గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే వేతన సవరణ కమిటీతో పాటు నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణకు అంగీకరిస్తూ ఇంధనశాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది.
 
 అంతేగాక కమిటీ విధివిధానాలపై ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్‌కో ఎండీ విజయానంద్ తదితరులు జేఏసీ నేతలతో విద్యుత్ సౌధలో గురువారం నాలుగు గంటలకుపైగా సమావేశమయ్యారు. మార్చి 31 నాటికి నివేదిక ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేసింది. అదేవిధంగా తమ వేతన సవరణను అవసరమైతే కొంత తగ్గించైనా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలను సవరించాలని జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు సమావేశంలో పట్టుబట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులకూ ప్రత్యేకంగా వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు కూడా యాజమాన్యం అంగీకరించింది.

>
మరిన్ని వార్తలు