ప్రతిధ్వనించేలా ప్రజాసంకల్పయాత్ర

2 Aug, 2018 12:49 IST|Sakshi
పార్టీశ్రేణులతో సమీక్షిస్తున్న తలశిల రఘురాం, నాయకులు బూడి ముత్యాలనాయుడు, మళ్ల విజయప్రసాద్‌ ,అమర్‌నాథ్‌

ఈనెల రెండో వారంలో జిల్లాలోకి ప్రవేశం

అపూర్వ స్వాగతం పలకడానికి శ్రేణులు సమాయత్తం కావాలి

విశాఖ వేదికగా రాష్ట్ర స్థాయిలో అతిపెద్ద బహిరంగ సభ

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్పయాత్ర ప్రోగ్రామ్స్‌ కన్వీనర్‌ తలశిల రఘురాం

మద్దిలపాలెం(విశాఖ తూర్పు): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో చరిత్ర సృష్టించేలా విజయవంతం చేయడానికి సమాయత్తం కావాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్పయాత్ర ప్రోగ్రామ్స్‌ కన్వీనర్‌ తలశిల రఘురాం పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు చేయడానికి జిల్లా,నగర పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తల, అనుబంధ సంఘాలు, ముఖ్యనేతలతో బుధవారం ఆయన నగర పార్టీ కార్యాలయంలో అంతర్గత సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రూట్‌ మ్యాప్‌తో పాటు ఏఏ కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ఆయన పార్టీ శ్రేణులతో చర్చించారు.

రెండో వారంలో జిల్లాలోకి ప్రవేశం
ప్రజాసంకల్పయాత్ర జిల్లాలోకి పాయకరావుపేట వద్ద ఈ నెల రెండోవారంలో ప్రవేశిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనంతగా అపూర్వ స్వాగతం పలికేందుకు పార్టీశ్రేణులు సమయత్తం కావాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో యాత్ర సాగేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ అక్కడ జగన్‌మోహన్‌రెడ్డితో మమేకమయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రధానంగా నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తామని తెలిపారు.

అద్వితీయంగా పాదయాత్ర సాగాలి
విశాఖ జిల్లాలో పాదయాత్ర ఏ జిల్లాలోనూ జరగని వి«ధంగా అపూర్వంగా, అద్వితీయంగా సాగేలా పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమించాలని తలశిల పిలుపునిచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డికి జననీరాజనంతో సంఘీభావం తెలపాలన్నారు.

విశాఖలో భారీ బహిరంగ సభ
విశాఖ జిల్లాలో భారీ బహిరంగ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి సాగి దుర్గాప్రసాద్‌ చెప్పారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సభ కంటే నాలుగింతలు పెద్ద సభ నిర్వహించనున్నామన్నారు. పాదయా త్ర, బహిరంగ సభను విజయవంతం చేయడానికి జిల్లా, నగర కమిటీలు, పార్టీశ్రేణులు, కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో చేపట్టే పాదయాత్ర ఒక మైలురాలు కావాలన్నారు. సమావేశంలో శాసనసభ ఉపప్రతిపక్ష నేత బూడి ముత్యాలనాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు మళ్లవిజయప్రసాద్, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి, విశాఖపట్నం పార్లమెంట్‌ కో ఆర్డినేటర్లు వరుదు కల్యాణి, ఎంవీవీ సత్యనారాయణ, సమన్వయకర్తలు (పాయకరావుపేట), వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌(తూర్పు), తిప్పలనాగిరెడ్డి (గాజువాక), అక్కరమాని విజయనిర్మల(భీమిలి),  అదీప్‌రాజు (పెందుర్తి), పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌(నర్సీపట్నం), చెట్టి పాల్గుణ(అరుకు), భాగ్యలక్ష్మి(పాడేరు), మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, రాష్ట్ర కార్యదర్శి ఉరుకూటి అప్పారావు, నగర యూత్‌ అధ్యక్షుడు కొండా రాజీవ్, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు, పార్టీ అనుబంధాల సంఘాల అధ్యక్షులు కె.రామన్నపాత్రుడు, బోని శివరామకృష్ణ, బద్రీనాథ్, తుల్లి చంద్రశేఖర్, శ్రీనివాస్‌గౌడ్, బర్కత్‌ఆలీ, శ్యామ్‌కుమార్‌రెడ్డి, సుధాకర్, సురేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు