160వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

12 May, 2018 21:03 IST|Sakshi

సాక్షి, కైకలూరు :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 160వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. ఆదివారం ఉదయం కైకలూరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కాకతీయ నగర్‌, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడ లంక మీదుగా మణుగులూరు చేరుకొంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. 

లంచ్‌ బ్రేక్‌ అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి  కాలకర్రు మీదుగా వైఎస్‌ జగన్‌ మహేశ్వర పురం చేరుకొని పాదయాత్ర ముగిస్తారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర : జననేత వైఎస్‌ జగన్‌ పాదయ్రాత 159వరోజు ముగిసింది. శనివారం గన్నవరం క్రాస్‌, మండవలల్లి, చిగురుకోట క్రాస్‌, భైరవపట్నం, చావలిపాడు, కైకలూరు మీదుగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగింది.

మరిన్ని వార్తలు