చిక్కిన ‘కృష్ణమ్మ’

9 Aug, 2014 02:41 IST|Sakshi
చిక్కిన ‘కృష్ణమ్మ’

* ప్రకాశం బ్యారేజి వద్ద 10.5కు చేరిన నీటిమట్టం
* పదేళ్లతో పోలిస్తే ఇదే గణనీయమైన తగ్గుదల


 తాడేపల్లి రూరల్:  ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది నీటి మట్టం గణనీయంగా తగ్గింది. గత పదేళ్లతో పోల్చి చూస్తే ఈ స్థాయిలో తగ్గటం ఇదే తొలిసారి. ఎగువ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు నీరు రాకపోవడమే దీనికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. అలాగే కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాగులు, వంకలు కలిసే ప్రదేశాల్లో వర్షాలు పడకపోవడం వల్ల బ్యారేజి నీటి మట్టం 10.5కు చేరింది. దీంతో వీటీపీఎస్ ప్లాంట్‌కు నీరు అందడం లేదు. మరో రెండు రోజులు ఇలానే కొనసాగితే వీటీపీఎస్‌కు నీరు అందక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదు.
 
 దీనిపై బ్యారేజి డీఈ వెంకట్‌కుమార్ మాట్లాడుతూ...
* పకాశం బ్యారేజి వద్ద 10.5 అడుగుల నీరు మాత్రమే ఉంది, దీని నుంచి తూర్పు కాలువకు 1600 క్యూసెక్కులు, పశ్చిమ కాలువకు 740 క్యూసెక్కుల నీటిని ఇవ్వడంతోపాటు, గుంటూరు తాగునీటి అవసరాల నిమిత్తం మరో 60 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నాం.
  వీటీపీఎస్‌కు మోటార్ల ద్వారా నీటిని తీసుకుంటున్నారు.
* నాగార్జునసాగర్ వద్ద నాలుగు రోజుల క్రితమే నీటిని కిందకు వదిలారు, రానున్న రెండు రోజుల్లో ప్రకాశం బ్యారేజి వద్దకు ఆ నీరు చేరుతుంది.

మరిన్ని వార్తలు