ఎమ్మెల్యేలు అనే మేము...

13 Jun, 2019 08:21 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : రాష్ట్ర రాజధాని అమరావతిలోని శాసనసభలో బుధవారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన వారు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారులో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు  మరో 10 మంది శాసన సభ్యులతో బుధవారం వెలగపూడి సభలో ప్రొటెం స్పీకర్‌ శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం వీరంతా శాసనసభ వ్యవహారాల సలహాసంఘ సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 12 మందిలో ఇద్దరు అత్యధికంగా 5 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయిన వారుండగా మరో ఇద్దరు ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడోసారి ఒకరు, రెండో సారి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా తొలిసారిగా నలుగురు శాసనసభకు ఎన్నికయినవారున్నారు.

ఒంగోలు నుంచి ఐదు సార్లు విజయం..
బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) అనే నేను ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను... అంటూ ఒంగోలు అసెంబ్లీ నుంచి 5వ సారి శాసన సభకు ఎన్నికైన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా 2004, 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికైన బాలినేని 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. తిరిగి 2019 ఎన్నికల్లో అదేపార్టీ నుంచి పోటీ చేసి ఐదోసారి శాసనసభకు ఎన్నికయ్యారు.

మూడు స్థానాలు ఐదు సార్లు..

  • 1978 అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం కృష్ణమూర్తి తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985లో మార్టూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989, 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచే అద్దంకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సారి 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికయ్యారు.  

ఈ ఇద్దరూ 4వ సారి..

  • 1989లో కందుకూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మహీధర్‌రెడ్డి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు.తర్వాత 2004,2009 లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికయ్యారు.2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా 4వ సారి ఎన్నికయ్యారు.
  • 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తొలిసారి శాసన సభకు ఎన్నికైన గొట్టిపాటి రవికుమార్‌ ఆ తర్వాత 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నిక కాగా 2019 ఎన్నికల్లో అద్దంకి నుంచి టీడీపీ తరుపున శాసన సభకు ఎన్నికయ్యారు. 

3వసారి ఆదిమూలపు సురేష్‌ :

  • 2009లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిమూలపు సురేష్‌ తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. 2014లో సంతనూతలపాడు నుండి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో తిరిగి యర్రగొండపాలెం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. 

ముగ్గురు 2వసారి..

  • 2009 ఎన్నిలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసిన అన్నా రాంబాబు తొలిసారి శాసన సభకు ఎన్నిక కాగా 2019లో వైఎస్సార్‌ సీపీ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోమారు రికార్డు మెజారిటీతో శాసన సభకు ఎన్నికయ్యారు.
  • 2014 ఎన్నికల్లో కొండపి, అద్దంకి నియోజకవర్గాల నుంచి టీడీపీ తరుపున పోటీ శాసన సభకు ఎన్నికైన డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావులు 2019 ఎన్నికల్లోనూ అదే స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా మరో మారు ఎన్నికయ్యారు. 

తొలిసారి ఎమ్మెల్యేలుగా..
2019 ఎన్నికల్లో మార్కాపురం, దర్శి, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన కుందురు నాగార్జునరెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, బుర్రా మధుసూదన్‌యాదవ్, టీజేఆర్‌ సుధాకర్‌బాబులు తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌పై లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

ఏపీలో రాజ్‌భవన్‌కు భవనం కేటాయింపు

గంటపాటు లిఫ్టులో నరకం

ఎక్కడికెళ్లినా మోసమే..

పసుపు–కుంకుమ నిధుల స్వాహా!

ఏళ్లతరబడి అక్కడే...

గంటపాటు లిఫ్టులో నరకం

పేదల ఇంట 'వెలుగు'

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

చంద్రబాబుపై సెటైర్లు.. సభలో నవ్వులు..!

చేయి చేయి కలిపి...

పని చేస్తున్నసంస్థకే కన్నం

స్కూటీ.. నిజం కాదండోయ్‌

బస్సుల కోసం విద్యార్థుల నిరసన

రెవెన్యూలో అవినీతి జలగలు.!

అల్లుడిని చంపిన మామ

అక్రమ కట్టడాల తొలగింపుపై చర్చించడమా?

చినుకు పడితే చెరువే..

బాపట్లవాసికి జాతీయ అవార్డు!

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స

ఆ వంతెన మొత్తం అంధకారం

మేఘాలే తాకాయి.. ‘హిల్‌’ హైలెస్సా..

ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి

చీకటిని జయించిన రాజు

విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం

ఆ‘ఘనత’ చంద్రబాబుదే..!

దారి మరిచాడు..ఆరు కిలోమీటర్లు నడిచాడు

విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌