జన్మంతా గుర్తుంచుకుంటాం.. 

6 May, 2020 08:49 IST|Sakshi
ప్రత్యేక బస్సుల్లోకి ఎక్కుతున్న ప్రకాశం జిల్లా వాసులు

సాక్షి, పాలకొండ‌: కష్టకాలంలో అధికారులు చూపిన ఆదరణను వారు మర్చిపోలేకపోతున్నారు.. ఆకలి కాలంలో అన్నం పెట్టి, ఆతిథ్యమిచ్చిన ప్రభుత్వానికి వేనవేల కృతజ్ఞతలు చెబుతున్నారు. పాలకొండ గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహంలో 40 రోజుల కిందట ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన 110 మంది చెరుకు కొట్టేవారు ఆశ్రయం పొందారు. నెల రోజులపైబడి వారికి అధికారు లు అన్నపానాదులిచ్చి జాగ్రత్తగా చూసుకున్నా రు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో వా రంతా సోమవారం అర్ధరాత్రి స్వగ్రామాలకు పయనమయ్యారు.

వీరిని తరలించేందుకు ఆర్డీ వో టి.వి.ఎస్‌.జి.కుమార్‌ నేతత్వంలో ఆర్డీసీ మే నేజర్‌ వై.ఎస్‌.ఎన్‌.మూర్తి ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. ఊరుకాని ఊరిలో అధికారులు చూపిన ఆదరణకు వారు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపా రు. అధికారులతో విడదీయలేని బంధం ఏ ర్పడిందని తెలిపారు. నిత్యం వారికి యోగా, క్రీడలు నేర్పిచడం సామూహిక భోజనాలు, వలసదారుల పిల్లలకు చదువు చెప్పడం వంటి పనులతో సిబ్బంది బాగా కలిసిపోయారు. దీంతో వీడ్కోలు చెప్పినప్పుడు అందరి కళ్లు చె మర్చాయి. అధికారులతో ఫొటోలు సెల్ఫీలు తీసుకుని బరువెక్కిన హృదయాలతో వారు స్వగ్రామాలకు వెళ్లారు.   

జీవితంలో మర్చిపోలేం 
కష్టకాలంలో ప్ర భుత్వం మాపై చూపించిన ఔదార్యం జీవితంలో మర్చిపోలేం. కు టుంబాలతో సహా దా దాపు నలభై రోజులు ఆశ్రయం పొందాం. అధికారులు సొంత కు టుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు. మా యోగక్షేమాలను నిత్యం దగ్గరుండి పర్యవేక్షించారు. కొత్త బట్టలిచ్చారు. వైద్యసేవలు అందుబాట్లో ఉంచారు. కోరిన భోజనం అందించారు. ఇక్కడ నుంచి వెళ్లాలంటే బాధగా ఉంది. – ఎం.సువర్ణరాజు, చెరుకు కొట్టే కార్మికుడు, ప్రకాశం జిల్లా. 

వెలుగులు నింపారు 
పురిటి నొప్పులతో బాధపడుతున్న నన్ను స్థానిక అధికారులే రక్షించారు. అర్ధరాత్రి వారి కారులో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాకు మగ బిడ్డ పుట్టాడు. మా కుటుంబంలో అధికారులే వెలుగులు నింపారు. అధికారుల రుణం తీర్చలేనిది. కలెక్టర్‌ నాకు రూ.25వేలు నగదు అందించగా ఆర్డీవో మాకు అవసరమైన మందు లు, బట్టలు అందించారు. ఏపీఓ సాగర్‌ వారి సొంత బిడ్డలా ఆదరించారు.  – ఎం.మరియమ్మ, మిట్టపాలెం, ప్రకాశం జిల్లా.  

మరిన్ని వార్తలు