పరిచయం + ప్రేమ + పెళ్లి = మోసం

6 Mar, 2020 13:17 IST|Sakshi
ప్రమీల

కులం పేరిట వదిలించుకునే ప్రయత్నం

ప్రస్తుతం బాధితురాలు 5 నెలల గర్భిణి  

టెక్కలి పోలీసులను ఆశ్రయించిన వైనం

శ్రీకాకుళం, టెక్కలి రూరల్‌: రైల్లో ఆ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసి ఆమెను గర్భిణిని చేసింది. ఆ తర్వాత ఒత్తిడి చేయడంతో ప్రియురాలిని మనువాడాడు. ఇప్పుడు తక్కువ కులం దానివంటూ వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో దిక్కుతోచని ఆమె తనకు న్యాయం చేయాలని గురువారం టెక్కలి పోలీసులకు మొరపెట్టుకుంది. బాధితురాలి కథనం మేరకు... టెక్కలి మండలం నౌపడ ఆర్‌ఎస్‌ గ్రామానికి చెందిన ముడాదాన ప్రమీల ఒక రోజు రైలులో విజయనగరం కోచింగ్‌ నిమిత్తం వెళ్తుండగా, అదే రైలులో వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన కొంకి వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. ఈయన ఆర్‌ఆర్‌బీ కోచింగ్‌ సెంటర్‌కి సంబంధించిన ఐడీ కార్డును ఆమె వద్ద వదిలేసి వెళ్లిపోయాడు.

వివాహ సర్టిఫికెట్‌ ,పెళ్లి రోజు ఫొటో  
ఆ తర్వాత ఈ కార్డు అతడికి అవసరమైనదని గుర్తించి దానిపై ఉన్న నంబర్‌కు ఆమె ఫోన్‌ చేసింది. అయితే తను కావాలనే వదిలి వెళ్లానని, ఆమెను ప్రేమిస్తున్నానని, రాజమండ్రిలో ఉన్నందున ఐడీ కార్డు కోసం తర్వాత వస్తానని చెబుతూ రోజూ ఫోన్‌ చేసేవాడు. అలా వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో నెల రోజుల తర్వాత ఆమె కూడా రాజమండ్రి బీఈడీ కోచింగ్‌కు వెళ్లింది. దాంతో ఇరువురు కలుసుకోవడంతో ప్రమీల గర్భం దాల్చింది. ఈ విషయం అతడికి చెప్పడంతో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం చర్చిలో గత నెల 4న పెళ్లి చేసుకున్నారు. 15 రోజులపాటు కాపురం చేసిన వెంకటేష్‌ ఆ తర్వాత తన నాన్న కరువులు దగ్గరకు వచ్చేశాడు. అప్పటి నుంచి గర్భం తొలిగించుకోవాలని ఒత్తిడి చేసేవాడు. దానికామె తిరస్కరించగా ఏలుకోనని తేల్చి చె ప్పాడు. తక్కువ కులం దానివంటూ దూషించడంతో బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి టెక్కలి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం బాధితురాలు ఐదు నెలల గర్భిణి కావడంతో న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా