వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద గర్భస్థ మృత శిశువు

5 Jul, 2018 06:36 IST|Sakshi
గర్భస్థ మృత శిశువు

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద గర్భస్థ మృతశిశువు లభ్యమైంది. బుధవారం ఉదయం కుక్కల గుంపు కార్యాలయం గేటుకు సమీపంలో అరుస్తూ ఉండగా అటుగా వెళ్లిన వారు గమనించి అది  మృతశిశువుగా గుర్తించారు. వెంటనే కుక్కలను తరిమివేసి.. విషయాన్ని పోలీసులకు చెప్పారు. నెలలు నిండకుండానే జన్మించిందో లేక అబార్షన్‌ చేశారో తెలియదు గానీ అవయవాలు పూర్తిగా ఏర్పడకుండా ఉన్న గర్భస్థ మృతశిశువు అక్కడ పడి ఉంది.

ఉదయం ఓ మహిళ కార్యాలయం గేటు వద్ద కాసేపు కూర్చుని వెళ్లిందని, ఆమె వెళ్తూ అట్ట డబ్బాలో దేన్నో వదిలేసి వెళ్లిందని పోలీసులకు కొందరు చెప్పినట్లు సమాచారం. అనంతరం పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు కలిసి మృతదేహాన్ని ఖననం చేయించారు. భ్రూణహత్యలు నిరోధిస్తామని, స్కానింగ్‌ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేస్తామని నిరంతరం చెప్పే వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్దే మృతశిశువును వదిలేయడం కలకలం సృష్టించింది.
 

మరిన్ని వార్తలు