గోదావరి వరదలతో గర్భిణుల అవస్థలు

4 Aug, 2019 17:37 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో వరదల కారణంగా గర్భిణులు తీవ్రంగా ఇబ్బందులకు గురువుతున్నారు. వీఆర్‌ పురం మండలం వడ్డిగూడెం గ్రామంలోకి అధికంగా వరద నీరు చేరింది. అంతేకాకుండా కల్లేరు గ్రామాన్ని పూర్తిగా వరదనీరు చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో ఓ గర్భిణి చింతూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరినా  ఇంకా ప్రసవ సమయంల రాలేదని అక్కడి వైద్యులు ఆమెను ఇంటికి పంపించేశారు. నొప్పులు అధికం కావటంతో స్థానిక అంగన్వాడి కార్యకర్త సహాయంతో ప్రసవం చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం లాంచీపై కల్లేరు గ్రామానికి వెళ్లిన వైద్యులు తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. కాగా ఒకవైపు వరదల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతుంటే మరోవైపు దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు.

మరిన్ని వార్తలు