ఒకటో తారీఖు కోసం ఏర్పాట్లు

30 Nov, 2016 03:46 IST|Sakshi
ఒకటో తారీఖు కోసం ఏర్పాట్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
 
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు, పింఛనుదారులకు డిసెంబరు 1వ తేదీన నోట్ల ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. చిన్న నోట్లు అందించే దిశగా కేంద్రంతోనూ, రిజర్వు బ్యాంకుతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని మంగళ వారం రాత్రి కమాండ్ కంట్రోల్ కార్యా లయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పింఛనుదారులకు  అవసర మైన చిన్న నోట్లను బ్యాంకు కరస్పాం డెంట్లు,  గ్రామ కార్యదర్శులు ఇస్తారని, వారి ఖాతాల్లో ప్రభుత్వం జమచేసిన మొత్తాలకు అనుగుణంగా ఈ చెల్లింపులు ఉంటాయని చెప్పారు. డ్వాక్రా గ్రూపులు, నరేగా గ్రూపు సభ్యులు తమ ఖాతాల్లో డిసెంబరు 1న ప్రభుత్వం జమ చేసిన మొత్తాలను ఒకేసారి విత్ డ్రా చేయకుండా అవసరమైన మేరకు తీసుకోవాలని కోరారు.

 ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించండి
 ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి అద్దె, ఇతర ముఖ్య చెల్లింపులకు నగదు తీసుకుని, మిగి లిన మొత్తాలకు ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిం చాలని సూచించారు.  ‘ఏపీ పర్సు’ యాప్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. బ్యాంకు అధికారులను అవమాన పరిచే రీతిలో తానేమీ మాట్లాడలేదని, వారలా భావిస్తే  తానేమీ బాధపడనని, అవసరమైతే వారితో ఇంకా గట్టిగా కూడా మాట్లాడతానని బాబు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 తిరుపతిలో సైన్స్ మ్యూజియం
 తిరుపతిలో జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగనున్న 104వ ఇండియన్ సైన్‌‌స కాంగ్రెస్  కోసం జరుగుతున్న ఏర్పాట్లపై మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులు, విశ్వవిద్యాలయాల వీసీలతో సమీక్ష జరిపారు. ప్రతిష్టాత్మక సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు చిహ్నంగా తిరుపతిలో వంద ఎకరాల్లో బ్రహ్మాండ పేరుతో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలని, అదేరోజు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేరుుంచాలని సమావేశంలో నిర్ణరుుంచారు.

మరిన్ని వార్తలు