నిత్యవసరాల ధరలను అందుబాటులో ఉంచాలి

19 Jun, 2014 02:43 IST|Sakshi
నిత్యవసరాల ధరలను అందుబాటులో ఉంచాలి

 జాయింట్ కలెక్టర్  యాకూబ్‌నాయక్ ఆదేశం
 
 ఒంగోలు కలెక్టరేట్ :
నిత్యవసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్ ఆదేశించారు. స్థానిక తన చాంబ ర్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించి న జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బియ్యం ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని, పౌరసరఫరాలశాఖ ద్వారా రైతు బజార్లలో బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే కందుకూరు రైతు బజార్‌లో నెల్లూరు సన్నాలు బియ్యాన్ని కిలో 30 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపా రు.
 
 ఒంగోలులోని రైతు బజార్లలో కూడా ఆ రకం బియ్యాన్ని అదే ధరకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైస్‌మిల్ల ర్ల యజమానులతో సమావేశాన్ని ఏర్పా టు చేసి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సాధారణ ధరకే బియ్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతు బజార్లలో కూడా కొన్నిరకాల నిత్యవసర సరుకుల ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ జేసీ అసహనం వ్యక్తం చేశారు. టమోటా కిలో 32, కందిపప్పు 62, మినుములు 44, ఉల్లిపాయలు కిలో 17 రూపాయల ధర ఉందన్నారు. ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను జేసీ ఆదేశించారు.

 ప్రజల జీవితాలతో చెలగాటం : మాగులూరి
వ్యాపారస్తులు కల్తీ మినరల్ వాటర్ విక్రయిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వినియోగదారుల సంఘ అధ్యక్షుడు మాగులూరి నాగేశ్వరరావు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు తనిఖీలు నిర్వహించి లెసైన్స్ లేని మినరల్ వాటర్ కంపెనీలను మూసివేయించాలని కోరారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ హోదాను ఒంగోలు దక్కించుకున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు.

గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని మరో సభ్యుడు ఫిర్యాదు చేశారు. అధికంగా వసూలు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రంగాకుమారి, సివిల్ సప్లయిస్ డీఎం కొండయ్య, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఉద్యానవనశాఖ ఏడీలు రవీంద్ర, జెన్నమ్మ, తూనికలు, కొలతలశాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు