కడప సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య

5 May, 2015 17:51 IST|Sakshi

కడప :  జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం వైఎస్సార్ కడప జిల్లాలోని కేంద్ర కారాగారంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతరపురం జిల్లా తలపుల మండలానికి చెందిన కృష్ణమూర్తికి తన భార్యను హత్య చేసిన కేసులో అనంతపురం జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే కృష్ణమూర్తిని జైలు అధికారులు కడప కేంద్రకారాగారానికి తరలించారు. కాగా మంగళవారం జైలులో ఉన్న బాత్‌రూంలో ఉరి వేసుకొని కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు