పాతపట్నంలో ప్రైవేటు ఆస్పత్రి సీజ్

18 Feb, 2014 02:21 IST|Sakshi
పాతపట్నం, న్యూస్‌లైన్: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కనకమహాలక్ష్మి మెడికేర్‌పై అధికారులు కొరడా ఝులి పించారు. పాలకొండ  ఆర్డీవో ఎస్.తేజ్‌భరత్, ఇతర అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు జరిపారు. అనుమతి ప త్రాలు లేకుండా మెడికల్ స్టోర్, ల్యాబ్, ఆస్పత్రి రెండేళ్ల నుం చి నిర్వహిస్తుండడాన్ని గుర్తించి..విస్తుపోయారు. కనీసం వైద్యుడు కూడా లే కుండా ఎలా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంబంధిత యాజమాన్యం పత్రాలు చూపించకపోవడంతో..వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించా రు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే..ఆస్పత్రులు, ల్యా బ్‌లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహశీల్దార్ బి.ఎస్.ప్రకాష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జి.లక్ష్మీనారాయ ణ, వీఆర్‌వో మురళీ, పాతపట్నం ఎస్‌పీహెచ్‌వో డాక్టర్ వేణుగోపాల్, సీహెచ్‌వో ఐ.నారాయణరావు, సీనియర్ సహాయకుడు శేఖర్ పట్నాయక్, పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ పైల ప్రియాంక సమక్షంలో మెడికేర్‌ను సీజ్ చేశారు.
 
మరిన్ని వార్తలు