విద్య.. విక్రయాలయాలు

6 Jul, 2018 09:24 IST|Sakshi

నర్సరీ, కేజీ విద్యకు రూ. వేలల్లో పుస్తకాలు

అమలుకు నోచుకోని జీఓ నంబర్‌ 91

పలు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ

పట్టించుకోని జిల్లా విద్యాశాఖ

పైన మీరు చదివింది నిజమే.. ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాలయాలను మనం ఇప్పుడు ఇలానే అనాలేమో. ఎందుకంటే ప్రస్తుతం ఇవి వ్యాపార కేంద్రాలుగా మారాయి. సామాన్యులను భయపెట్టేస్తున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే మామూళ్ల మత్తులో విద్యాశాఖజోగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదేమంటే విద్యార్థుల తల్లిదండ్రులు రాతపూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామంటున్నాయని,
 ఏ పాఠశాల ఎంత ఫీజు వసూలు చేస్తుందన్న విషయం వారికి తెలియదా? అని విద్యార్థుల  తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
 

చిత్తూరుఎడ్యుకేషన్‌: జిల్లాలోని కొన్ని ప్రైవేటు వి ద్యాసంస్థలు ఏటా ఇష్టానుసారం ఫీజులు పెంచు తూ వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఎల్‌కేజీ, యూకేజీ చదువులకే రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తుండడంతో పాటు, యూని ఫామ్, టై, బెల్డు, షూ, పాఠ్య పుస్తకాలు, నోటు   పుస్తకాలు తమ వద్దే కొనాలంటూ అందిన కాడికి దోచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం 894 ప్రైవేటు, 150 కార్పొరేట్‌ పాఠశాలలున్నాయి. వీటిలో అధిక శాతం పాఠశాలల్లో ఎల్‌కేజీకి రూ.8 వేలు నుంచి రూ.12 వేల వరకు, పదోతరగతికి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నాయి. అక్కడితో సరిపెట్టుకోక అడ్మిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాఠశాల అభివృద్ధి, పరీక్ష రుసుములు పేరిట రూ.వేలకు వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అ యితే అందుకు తగ్గట్లు సౌకర్యాలు మాత్రం లేవు.

విద్యా వ్యాపారం
ప్రభుత్వం ముద్రించిన ఇంగ్లిషు మీడియం పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నా వాటి జోలికి వెళ్లడం లేదు. ఆరో తరగతి నుంచి ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలే వాడాలని నిబంధన ఉన్నా దాన్ని పట్టించుకోవడం లేదు. ఐఐటీ, ఒలింపియాడ్, ఇతర కారణాలు చెబుతూ కొన్ని యాజమాన్యాలు ఇతర పుస్తకాలను విక్రయిస్తున్నాయి. ఇలా ఒక్కో తరగతి పుస్తకాల సెట్‌కు రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇవే కాకుండా నోటుపుస్తకాలు, షూస్, టై, బెల్ట్‌ ఇలా అన్ని పాఠశాలల్లో కొనాల్సిందే.

కనిపించని పేరెంట్స్‌ కమిటీలు
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి, విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడానికి పాఠశాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీ లించడానికి పేరెంట్స్‌ కమిటీని విధిగా ఏర్పాటు చేయాల్సిఉంది. కానీ ఎక్కడా పేరెంట్స్‌ కమిటీలు కనిపించడం లేదు.

ఊసే లేని ఫీజుల నియంత్రణ కమిటీ
ఫీజుల నియంత్రణకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా డీఈఓ, జెడ్పీ సీఈఓ ,సభ్యులుగా సాంఘిక, గిరిజన, బీసీ  సంక్షేమ శాఖల అధికారులు వ్యవహరించాలి. అయితే జిల్లాలో ఈ కమిటీ నియామకం జరగలేదని తెలుస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి ప్రభుత్వం 2014లో జీఓ నంబర్‌ 91ని తీసుకొచ్చింది. ఈ జీఓ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.12 వేలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. ఎక్కడా ఈ జీఓ అమలు చేయలేదు.

కార్పొరేట్‌ రూటే సపరేట్‌
కొన్ని కార్పొరేట్‌ పాఠశాలల్లో నర్సరీ నుంచి యూకేజీ వరకు పిల్లలకు ఫీజు రూ.15 వేలు ఉండగా, రెండు జతల యూనిఫామ్‌ రూ.2 వేలు, టై, బెల్ట్, బ్యాడ్జ్‌లకు రూ.500, రెండు రకాల షూలకు రూ.850, నోటు పుస్తకాలకు రూ.500, బ్యాగ్‌ రూ.500, లంచ్‌బాక్స్‌ రూ.300, తదితర ఖర్చులు కలుపుకుని సుమారు రూ.5 వేలు అవుతోంది. ఇది కేవలం నర్సరీ నుంచి యూకేజీ విద్యార్థికే.  ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులకు ఏ స్థాయిలో ఫీజులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఎంఈఓలకు ఆదేశించాం  
అధిక ఫీజులు వసూలు చేయడం, పాఠశాలల్లో నోటుపుస్తకాలు, స్టేషనరీ అమ్మడం చట్టరీత్యానేరం. ప్రైవేట్‌ పాఠశాలలను తనిఖీ చే యాలని ఎంఈఓలను ఆదేశించాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల తల్లిదండ్రులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే సబం«ధిత పాఠశాలపై చర్యలు తీసుకుంటాం.      – పాండురంగస్వామి, డీఈఓ

మరిన్ని వార్తలు